రోడ్డెక్కిన చక్రి కుటుంబం

Chakri Family Fights For Assets

03:34 PM ON 1st March, 2016 By Mirchi Vilas

Chakri Family Fights For Assets

జగమంత కుటుంబం నాది అంటూ చిన్న వయస్సులోనే తిరిగిరాని లోకాలకు వెళ్ళిన దివంగత సినీ సంగీత దర్శకుడు చక్ర్తి కుటుంబం ఇప్పుడు రోడ్డెక్కింది. తమకు న్యాయం చేయాలని కోరుతోంది. వివరాల్లోకి వెళితే,  హైదరాబాద్ సోమాజీగూడలోని వరుణ్‌ స్వర్గం విల్లా ఎదుట చక్రి కుటుంబ సభ్యులు ఆందోళన చేపట్టారు. తమ ఇంటిని అద్దెకు తీసుకున్న వారు 8 నెలలుగా అద్దె చెల్లించకుండా, పైగా ఇళ్లు ఖాళీ చేయకుండా ఇబ్బందులకు గురి చేస్తున్నారని చక్రి తల్లి, సోదరుడు ఆవేదన వ్యక్తం చేసాడు. ఇల్లు తమకు అప్పగించే వరకు ఆందోళన కొనసాగిస్తామని స్పష్టం చేశారు. విషయం తెలుసుకున్న తెలంగాణ హోంమంత్రి నాయిని నర్శింహారెడ్డి ఫోన్‌లో చక్రి సోదరుడు మహిత్‌ నారాయణతో మాట్లాడారు. వారి కుటుంబానికి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు . దీంతో పరిస్థితి కొంత చక్కబడింది.

చక్రి గురించి ఆసక్తికరమైన కొన్ని విషయాలు...

1/6 Pages

కుటుంబ నేపధ్యం

చక్రి అసలు పేరు జిల్లా.చక్రధర్. చక్రి జూన్ 15, 1974 లో మహబూబాబాద్ లో జన్మించారు.  ఉపాధ్యాయుడైన చక్రి తండ్రి వెంకటనారాయణ కళాకారుడు కూడా , బుర్రకథలు స్వయంగా రాసుకొని ప్రదర్శించేవారు. చక్రి తల్లి విద్యావతి గాయని.

English summary

Music Director Chakri had died suddenly in 2014.Still now his family members were fighting each other for the assets of chakri.Today his mother and his wife fights for the house Which was in Somajiguda Hyderabad.