హాలీవుడ్ హీరోని డైరెక్ట్ చేస్తున్న నాటి చిన్నోడు

Chakri Tholeti directing hollywood hero

02:57 PM ON 12th August, 2016 By Mirchi Vilas

Chakri Tholeti directing hollywood hero

ఇక్కడ ఓ విషయం అందరికీ ఠక్కున గుర్తుకు వస్తుందని చెప్పొచ్చు. ఎందుకంటే టాలీవుడ్ లో కళాత్మక అంశంగా సంచలనం సృష్టించిన సాగర సంగమం సినిమా గురించి అనగానే మరి అందిరికీ గుర్తు వస్తుంది కదా. ఒకవేళ తెలీకపోతే ఏమి చేయలేము అనుకోండి. కానీ కమల్ హాసన్-జయప్రద కలిసి నటించిన బ్లాక్ బస్టర్ మూవీ 'సాగరసంగమం' లో ఫోటోలు తీసే ఓ బుడ్డోడున్నాడు. ఇప్పుడా చిన్నోడు పెద్దోడై మల్టీ స్టారర్ సినిమాలు డైరెక్ట్ చేయగలిగేంత స్థాయికి ఎదిగిపోయాడంటే ఆశ్చర్యం కలగక మానదు. అతడెవరోకాదు చక్రి తోలేటి. అమెరికాలో విజువల్ ఎఫెక్ట్స్, స్క్రీన్ రైటర్ గా శిక్షణ పొందిన చక్రి, కమల్ 'ఈనాడు' సినిమా ద్వారా ఇండస్ట్రీకి డైరెక్టర్ గా పరిచయం అయ్యాడు.

అజిత్ హీరోగా అప్పట్లో తమిళంలో సూపర్ హిట్ అయిన బిల్లా సినిమాకి సీక్వెల్ గా చక్రి తోలేటి డైరెక్షన్ లో 'బిల్లా-2' తెరకెక్కింది. అయితే, ఆ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా కొట్టేసింది. తాజాగా చక్రి టాలీవుడ్ జేమ్స్ బాండ్ హీరో పీర్స్ బ్రాస్నన్ తో ఒక ప్రతిష్టాత్మక యాడ్ ఫిల్మ్ చేశాడు. ఇప్పుడు అదే హీరోతో హిందీ-తెలుగు బైలింగ్విల్ మూవీ డైరెక్ట్ చేయబోతున్నాడు.

English summary

Chakri Tholeti directing hollywood hero