సింధుకు గిఫ్ట్ గా బీఎండబ్ల్యూ కారు

Chamundeswarnath announces 60 lakh BMW car for PV Sindhu

10:53 AM ON 19th August, 2016 By Mirchi Vilas

Chamundeswarnath announces 60 lakh BMW car for PV Sindhu

రియో బ్యాడ్మింటన్ మహిళ సింగిల్స్ లో ఫైనల్ కు దూసుకెళ్లిన తెలుగు తేజం పీవీ సింధు అరుదైన నజరానా అందుకోనుంది. భారత్ కి పతకం ఖాయం చేసిన సింధుకి క్రికెట్ ఐకాన్ సచిన్ టెండూల్కర్ చేతుల మీదుగా రూ.60 లక్షల విలువైన బీఎండబ్ల్యూ కారును అందబోతోంది. ఈ కారును తెలంగాణ బ్యాడ్మింటన్ సంఘం ఉపాధ్యక్షుడు, ఇండియన్ బ్యాడ్మింటన్ లీగ్ -ముంబై మాస్టర్స్ ఫ్రాంచైజీ సహ యజమాని చాముండేశ్వర్ నాథ్ గిఫ్ట్ గా ఇవ్వనున్నారు. ఈమేరకు ఆయన ఒక ప్రకటన విడుదల చేస్తూ.. సింధు ఈనెల 28న రియో నుంచి హైదరాబాద్ కు వస్తుందని, ఆ మరుసటి రోజు సచిన్ చేతుల మీదుగా ఈ బహుమతిని అందుకుంటుందని వివరించారు. కాగా గత లండన్ ఒలింపిక్స్ (2012)లో కాంస్యం సాధించిన సైనా నెహ్వాల్ కు అప్పట్లో చాముండి బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్ ఇచ్చారు.

ఇవి కూడా చదవండి:దీపాకు ఖేల్ రత్న ఇవ్వబోతున్నారా!

ఇవి కూడా చదవండి:సినిమా ఛాన్స్ కోసం ట్రై చేసే వారికి డైరెక్టర్ మారుతి బంపరాఫర్!

English summary

Telangana Badminton Association Vice President Chamundeswarnath announces 60lakh worth BMW car for Badminton Star P.V.Sindhu for winning medal in Rio Olympics.