ఆఫీసుల్లో పాలిటిక్స్ కి చెక్ పెడతారా? అయితే చాణక్యసూత్రాలు తెలుసుకోండి

Chanakya Great Lessons For Office Politics

12:45 PM ON 19th July, 2016 By Mirchi Vilas

Chanakya Great Lessons For Office Politics

రాజకీయాలు లేని రంగం లేదు. అన్నింటా రాజకీయమే. అంతేకాదు, ఏ రంగానికి చెందిన సంస్థలో పనిచేసినా, ఎక్కడ ఉద్యోగం చేసినా ఆయా ఆఫీసుల్లో రాజకీయాలు సహజం. కుట్రలు , కుతంత్రాలు కూడా ఉంటాయి. తాను ఎదగడం కోసమో, లేదంటే ఇతరులను అణచడం కోసమో, మరే ఇతర కారణాల వల్లో కొంత మంది ఉద్యోగులు ఎక్కడ ఏ ఆఫీసులో పనిచేసినా రాజకీయాలు చేస్తుంటారు. అందుకు అవసరమైతే తమ తమ బాస్ ల వద్ద లాబీయింగ్ చేయడం చూస్తుంటాం. చివరకు ఎలాగైతేనేం, తాము అనుకున్నది సాధించుకోగలుగుతారు. అయితే ఆఫీసుల్లో పనిచేసే ఉద్యోగులంతా ఈ కోవలోకి రారు. కొందరైతే అసలు ఇలాంటి రాజకీయాలు పట్టించుకోకుండా తమ పని తాము చేసుకుపోతుంటారు. అయినప్పటికీ వారు కూడా ఇలాంటి రాజకీయాల బారిన పడాల్సి వస్తుంటుంది. అప్పుడు ఏం చేయాలి? అందుకోసమే ఆచార్య చాణక్యుడు చెప్పిన కొన్ని సూత్రాలను పాటిస్తే ఆఫీసు రాజకీయాల్లో మీరే పైచేయి సాధించేందుకు అవకాశం ఉంటుంది. మరి, అవేమిటో తెలుసుకునే ప్రయత్నం చేద్దామా?

1/9 Pages

ఆచార్య చాణక్యుడు చెప్పిన ప్రకారం ప్రతి ఒక వ్యక్తిలో ఏదో ఒక బలహీనత ఉండడం సహజం. దాన్ని పసిగట్టి అందుకు అనుగుణంగా ప్రవర్తిస్తే ఆ బలహీనతలు ఉన్న వ్యక్తులు మనకు లొంగి ఉంటారు. ఈ క్రమంలో ఆఫీసులో పనిచేసే ఉద్యోగులు తమ పక్కవారి బలహీనతలను తెలుసుకోవాలి. దీంతో వారిపై ఆధిపత్యం చేసేందుకు అవకాశం ఏర్పడుతుంది. అయితే ఆ బలహీనతలను తెలుసుకోవాలంటే వారితో స్నేహం చేయాల్సిందే. అప్పుడే వారిపై పైచేయి సాధించగలం.

English summary

Chanakya Great Lessons For Office Politics