దేని దారి దాందే ....

Chandra Babu Birthday Wishes To Jagan

02:02 PM ON 21st December, 2015 By Mirchi Vilas

Chandra Babu Birthday Wishes To Jagan

ఓ పక్క అసెంబ్లీలో టిడిపి - వైసిపి దుమ్మెత్తి పోసుకుంటున్నా , మరోపక్క మిగిలిన విషయాల్లో తమదైన శైల్లో వ్యవహరిస్తున్నాయి. అసెంబ్లీ నుంచి ఏడాదిపాటు వైసిపి ఎం ఎల్ ఎ రోజా ను సస్పెండ్ చేసిన ఘటనపై దుమారం రేగుతున్న సంగతి తెల్సిందే.

అయితే సోమవారం ఉదయం అసెంబ్లీలోకి వైసిపి నేత జగన్ లోపలకు ప్రవేశించిన నేపధ్యంలో సిఎమ్ చంద్రబాబు , పలువురు మంత్రులు , ఎం ఎల్ ఏలు ఆయన దగ్గరకు వచ్చి కరచాలనం చేసి శుభాకాంక్షలు తెల్పారు. ఇంతకీ విషయం ఏమంటే ఈరోజు జగన్ పుట్టినరోజు కావడం. అన్నీ మరిచి జగన్ కి జన్మదిన శుభాకాంక్షలు తెల్పారు. అంతా నవ్వుతూ కనిపించారు.

అయితే ఆతర్వాత కధ మామూలే. రోజా పై సస్పెన్షన్ ఎత్తివేయాలని జగన్ తో సహా వైసిపి సభ్యులు నినదించారు. కుదరదని మంత్రి యనమల రామకృష్ణుడు స్పష్టం చేసారు. అవసరమైతే కోర్టుకు కూడా వెళ్ళవచ్చని ఆయన అన్నారు. దీంతో జగన్ నిరసన తెల్పుతూ , తమ పార్టీ ఎం ఎల్ ఎ లతో కల్సి వాకౌట్ చేసారు.

జగన్ ధోరణిని మంత్రులు యనమల , డాక్టర్ కామినేని శ్రీనివాస్ , పీతల సుజాత , అచ్చెన్నాయుడు తదితరులు తప్పుబట్టారు.

English summary

Today Andhra pradesh Cheif Minister Chandra Babu Naidu says birthday wishes to Y.S.Jagan Mohan Reddy in Assembly. Later Y.s.Jagan and co. boycott the assembly sessions