సీఎం చంద్రబాబు మాజీ అయ్యారా?

Chandra Babu Naidu ex cm in Linkedin

12:45 PM ON 27th June, 2016 By Mirchi Vilas

Chandra Babu Naidu ex cm in Linkedin

ఇది నిజంగా విచిత్రమైన ప్రశ్న. ఎందుకంటే నూతన రాజధాని కోసం ఎంతో శ్రమిస్తుంటే, విదేశాలకు తిరుగుతుంటే మాజీ అవ్వడం ఏమిటి? ఎన్నో కష్ట నష్టాలకు ఓర్చి - పాదయాత్రలు చేసి - మోడీని సైతం ఏపీకి రప్పించి - వరాల మీద వరాలు గుప్పించి - ఎన్నో టెన్షన్ లను తట్టుకుని, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చేత ప్రచారం చేయించుకుని, సాధించిన ముఖ్యమంత్రి పీఠం ఇప్పుడు ఏమైంది? అంతేకాదు, ప్రపంచంలో భారతీయేతరులను ఎవరినైనా ఇప్పడు చంద్రబాబు గురించి చెప్పండంటే ఠక్కున మాజీ సీఎం అని బదులిచ్చేస్తారు. ఇది ఎవరైనా గిట్టని వాళ్ళ ప్రచారమా అంటే, అదీ కాదు, మరి ఎలా అంటే? ఓ విధంగా చంద్రబాబే దీనికి కారణం అని చెప్పక తప్పదు.

ఎందుకో ఓసారి వివరాల్లోకి వెళదాం. ఎందుకంటే.. ప్రపంచంలోనే ప్రముఖ ప్రొఫెషనల్ సోషల్ నెట్ వర్కింగ్ సర్వీసైన లింక్డిన్ లో చంద్రబాబు మాజీ ముఖ్యమంత్రి అని వుంది. అది కూడా తెలుగుదేశం పార్టీకి మాజీ ముఖ్యమంత్రి అని కనిపిస్తోంది. లింక్డిన్ లో అప్ లోడ్ చేసిన డేటా ప్రకారం మొత్తానికి బాబు ఆంధ్రప్రదేశ్ కు చీఫ్ మినిస్టర్ కాదన్న మాట. కేవలం తెలుగుదేశం పార్టీకే ముఖ్యమంత్రి అన్న మాట. అది కూడా మాజీ!! మరి.. ఐటీలో హైదరాబాద్ ను మేటిగా నిలబెట్టింది నేనే. ప్రపంచానికే కంప్యూటర్ పాఠాలు నేర్పింది నేనే. ఓవరాల్ గా నేనో సూపర్ కంప్యూటర్ ను అని ఎప్పటికప్పుడు చెప్పుకునే చంద్రబాబు..

తన లింక్డిన్ ను మాత్రం ఎందుకు అప్డేట్ చేసుకోలేకపోవడం నిజంగా ఆశ్చర్యకరమైన విషయం కాక మరేమిటి? ఓ వైపు తెలుగు రాష్ర్టాలకు చంద్రబాబు ఐటీ పితామహుడిగా గుర్తింపు పొందారు. ఇక టీడీపీ నాయకులు - టోటల్ టీడీపీ గురించిన సమాచారం సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు జోరుగా అప్ డేట్ అవుతుంటుంది. మరి అలాంటి చంద్రబాబు సీఎంగా ఎన్నికై రెండున్నరేళ్లు అవుతున్నా, ఇంకా ఆయన లింక్డిన్ అక్కౌంట్ లో ఆయన తెలుగుదేశం పార్టీకి మాజీ ముఖ్యమంత్రిగా ఉండడాన్ని గమనించి అప్ డేట్ చేసుకోవాలని తెలీదా? మొత్తానికి దీన్ని మార్చడానికి రంగం సిద్ధం చేస్తున్నారట.

English summary

Chandra Babu Naidu ex cm in Linkedin