వీళ్లకు గట్టిగా క్లాస్ పీకిన బాబు

Chandra Babu Naidu Meeting With Bhuma Nagi Reddy And Shilpa Brothers

12:47 PM ON 3rd May, 2016 By Mirchi Vilas

Chandra Babu Naidu Meeting With Bhuma Nagi Reddy And Shilpa Brothers

కత్తి మీద సాము లాంటి పని చేసి,ఇప్పుడు దాని వలన వస్తున్న ఇబ్బందులను అధిగమించడానికి చంద్రన్న ప్రయత్నం ఆరంభించారు. వివరాల్లోకి వెళ్తే, ఆపరేషన్ ఆకర్ష్ లో భాగంగా ఏపీలో విపక్షం అనేది కనిపించకూడదనే రీతిలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు పధక రచన చేసి అమలు చేస్తున్నారు. ముఖ్యంగా ఇప్పుడున్న పరిస్థితుల్లో జగన్ భారీగా దెబ్బ తీయడం ద్వారా,వచ్చే ఎన్నికల నాటికి సరైన నేత జగన్ పక్షాన ఉండకుండా చేయాలని ఆయన వ్యూహం. ఫలితంగా 2019 ఎన్నికల్లోవ్యవహరిస్తోంది. ఇందుకోసం అందివచ్చిన చిన్న అవకాశం కూడా వదులుకో కూడదన్న పద్దతిని బాబు అనుసరిస్తున్నారు. ఫలితంగా ఎన్నో ఏళ్లుగా వర్గపోరులో నలిగే భిన్న దృవాలను ఒకే సైకిల్ మీద ప్రయాణించేలా ఆయన ప్లాన్ చేశారు. ఇది ప్రమాదకరమైన ప్రయత్నమని పలువురు చెబుతున్నా..దాన్ని విజయవంతంగా పూర్తి చేయగలిగితే.. ఏపీలో తాను తిరుగులేని అధినేతగా మారే అవకాశం ఉందన్న విషయాన్ని బాబు బలంగా విశ్వసిస్తున్నారు.

ఇవి కూడా చదవండి: చనిపోయిన గురువుని మమ్మీగా మార్చి పూజలు చేస్తున్న శిష్యులు!

ముఖ్యంగా కర్నూలు జిల్లాలో శిల్పా సోదరులకు ఏ మాత్రం పొసగని భూమా నాగిరెడ్డిని పార్టీలోకి చంద్రబాబు ఆహ్వానించడం, ఇక భూమా రాకతో.. కర్నూలు జిల్లా టీడీపీలో వర్గ పోరు తలెత్తడం షరా మామూలే అయింది. అంతర్గత విభేదాలతో శిల్పా.. భూమా వర్గీయుల మధ్య నడుస్తున్న రచ్చ పార్టీ ఇమేజ్ ను డ్యామేజ్ చేస్తోంది. దీనికి చెక్ చెప్పేందుకు చంద్రబాబు తాజాగా భూమానాగిరెడ్డి.. శిల్పా బ్రదర్స్ ను తన నివాసానికి పిలుపించుకున్నారు.

ఇవి కూడా చదవండి: రాజ్యసభకు లిక్కర్‌ కింగ్‌ రాజీనామా

ఒకచోట వాళ్ల్లను కూర్చోబెట్టి.. ఇద్దరికి చంద్రబాబు గట్టిగా క్లాస్ పీకినట్లుగా చెబుతున్నారు. ఇద్దరూ కొట్టుకుంటే పార్టీకి నష్టం ఖాయమని, అందుచేత ఇద్దరూ విభేదాలు లేకుండా నడవాలని సూచించినట్లు తెలుస్తోంది. ఫ్యాక్షన్ రాజకీయాల్ని ప్రోత్సహిస్తే మాత్రం తాను తీవ్ర నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుందన్న హెచ్చరిక చేసినట్లు చెబుతున్నారు. పార్టీలోకి నేతల ఎంట్రీ పార్టీకి బలం కావాలే కానీ బలహీనం కాకూడదని బాబు గట్టిగానే అన్నట్లు భోగట్టా. ఆ విషయంలో భూమా..శిల్పా వర్గీయులు జాగ్రత్తగా ఉండాలని బాబు చెప్పినా, ఎంతమేర ప్రభావం చూపుతుందో చూడాలి మరి.

ఇవి కూడా చదవండి: పీఎంగా నితీశ్‌,డిప్యూటీ పీఎం గా కేజ్రీ!

English summary

Andhra Pradesh Chief Minister Nara Chandra Babu Naidu calls Kurnool Telugu Desham Party Leaders Bhuma Nagi Reddy and Shilpa Brothers to his home and he had given class to them . Babu also suggested them not to fight with each other.