కార్యకర్తలే బలమట - మరి తమ్ముళ్ళ  పదవుల సంగతి 

Chandra Babu Naidu On TDP Volunteers

02:50 PM ON 1st December, 2015 By Mirchi Vilas

Chandra Babu Naidu On TDP Volunteers

వీలుంటే చాలు కార్యకర్తలను ఆకాశానికి ఎత్తేయడం సిఎమ్ చందబాబుకి అలవాటు. 'నాయకులు మోదం చేసినా , పార్టీలు మారినా కార్యకర్తలు మాత్రం పార్టీని వెన్నంటి వున్నారు. కార్యకర్తల త్యాగం మరువలేనిది. ఏమిచ్చినా వారి ఋణం తీర్చుకోలేనిది. మొన్న ఎన్నికల్లో టిడిపి అధికారంలోకి వచ్చిందంటే అది కార్యకర్తల చలవే' ఇవి చంద్రబాబు కార్యకర్తలను ఉద్దేశించే మాటలు. మంగళవారం జనచైతన్య యాత్రల ప్రారంభం సందర్భంగా గుంటూరు జిల్లా వేమూరులో జరిగిన సభలో కూడా మళ్ళీ ఇవే మాటలు. ఇన్ని చెబుతున్నారు గానీ నామినేటెడ్ పదవులు , ఎండోమెంట్ కమిటీలు 18నెలలుగా భర్తీచేయకుండా వున్నారు. రెండేళ్ళ కాలపరిమితికి కమిటీలు వేసి వుంటే మూడు బ్యాచ్ లలో చాలామంది కార్యకర్తలకు చోటు దక్కేది. ఆలెక్కన అప్పుడే ఓ బ్యాచ్ కాలపరిమితి కూడా పూర్తయ్యేది. ఏడాదిన్నర గడిచినా, పరిస్థతి లో మార్పు లేదు సరికదా , ఆకాశానికి ఎత్తేయడం రివాజైందని, పదేపదే అదే పాట పాడుతున్నారని కొందరు కార్యకర్తలు అంటున్నారు. జెండా మోసి మోసి భుజాలు కాయలు కాసినా , పదవుల పంట దక్కడం లేదని వాపోతున్నారు . ఇప్పటికైనా పరిస్థితి మారాలని కోరుకుంటున్నారు.

ఇంతకీ జనచైతన్య యాత్రలో బాబు గారు టిడిపి అధ్యక్షుని హోదాలో పాల్గొన్నారు. టిడిపి ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలను వివరించారు. ఈ 18నెలల కాలంలో ఎన్నో పధకాలను ప్రవేశ పెట్టామని చెప్పుకొచ్చారు. 'రాష్ట్రం కొత్తగా ఏర్పడింది. ఆదాయం లేదు ... అప్పులు వున్నాయి ... తెలంగాణా ఆదాయం 56%అయితే ఎపిది 44%మాత్రమే. అయినా ఇచ్చిన హామీలు నెరవేరుస్తున్నాం.' అని చంద్రబాబు చెప్పారు. యుగపురుషుడు , ఆపద్భాందవుడు నందమూరి తారకరామారావు పేద బడుగు బలహీన వర్గాలు , రైతుల కోసం దూరదృస్టి తో తెలుగుదేశం పార్టీని స్థాపించారని ఆయన వివరించారు. తెలుగుదేశం ఎప్పుడూ ప్రజా పక్షమేనన్నారు.

English summary

Andhra Pradesh Cheif Minister Chandra Babu Naidu Started Jana Chaitanya Yatra in vemuru village in guntur district,Andhra Pradesh