పవన్ యాక్షన్ కి బాబు రియాక్షన్

Chandra Babu Naidu reaction on Pawan comments

12:42 PM ON 29th August, 2016 By Mirchi Vilas

Chandra Babu Naidu reaction on Pawan comments

మొత్తానికి ఆ మధ్య జనసేన ఆవిర్భావం తర్వాత బహిరంగ సభ తనంత తానుగా అందునా హఠాత్తుగా జరిపిన జనసేన అధినేత.. పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సదరు బహిరంగ సభలో చేసిన ప్రసంగం ప్రభావం ఏపీ రాజకీయాలపై స్పష్టంగా పడింది. ఏపీకి ప్రత్యేక హోదా విషయంలో పవన్ చేసిన వ్యాఖ్యలకు వాళ్లు.. వీళ్లు అన్న తేడా లేకుండా అందరూ రియాక్ట్ అవుతున్నారు. కొందరు పవన్ ను సమర్థిస్తూ మాట్లాడితే, మరికొందరు విమర్శలు గుప్పించారు. ఇంకొందరు పవన్ పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు కూడా. పవన్ ను విమర్శించే క్రమంలో పవన్ కు మాత్రమే కాదు తమకు కూడా ఆవేశం ఉందన్న విషయాన్ని స్పష్టం చేస్తూ.. హావభావాలు ప్రదర్శిస్తూ మండిపడ్డారు.

ఇక ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు తాజాగా పవన్ వ్యాఖ్యలపై పరోక్షంగా రియాక్ట్ అయ్యారు. ప్రత్యేక హోదా విషయంలో తాము గట్టిగా పోరాడుతున్నట్లుగా చెప్పిన ఆయన, తానెవరికీ భయపడనని స్పష్టం చేశారు. నేనెవరికీ భయపడటం లేదు. ప్రత్యేక హోదా కోసం గట్టిగా పోరాడుతున్నాం అంటూ వ్యాఖ్యానించిన చంద్రబాబు, కేంద్రంపై తన అసంతృప్తిని వ్యక్తం చేశారు. ప్రజాసమస్యల పరిష్కారానికి అవసరమైన మౌలిక వసతుల ఏర్పాటు విషయంలోనూ మోడీ సర్కారు సహకరించటంలేదన్నది బాబు గారి ఆరోపణ. మొత్తానికి చంద్రబాబు మాటలు చూస్తే పవన్ ప్రభావం ఆయన మీద ఉన్నట్లు కనిపిస్తుంది.

పవన్ ఫైరింగ్ తో ఏపీ బీజేపీ నేతలు డిఫెన్స్ లో పడటమే కాదు, బీజేపీ అధినాయకత్వం కూడా చప్పుడు చేయని నేపథ్యంలో.. బాబు తనదైన బాణీలో గళం విప్పటం ద్వారా ఒత్తిడిని మరింత పెంచే ప్రయత్నం చేస్తున్నారని చెప్పొచ్చు. ఎప్పుడు ఎలా వ్యవహరించాలో.. ఏ సమయాన్ని ఎలా వినియోగించుకోవాలో అన్న విషయాలలో ఆరితేరిన చంద్రబాబుకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పవన్ సాకుతో కేంద్రంపై దుమ్మెత్తి పొసే దన్ను బాబుగారికి వచ్చిందనే మాటలు వినిపిస్తున్నాయి.

ఇది కూడా చదవండి: సింధుకి రెడ్ కారు ఇచ్చేసిన సచిన్

ఇది కూడా చదవండి: దారుణం.. అత్తమామలే పడకగది దృశ్యాలు చిత్రీకరించి.. ఆపై...

ఇది కూడా చదవండి: బస్సులో భార్య చనిపోతే.. ఆతర్వాత ఏమైందో తెలుసా(వీడియో)

English summary

Chandra Babu Naidu reaction on Pawan comments