పెద్దనోట్ల రద్దుపై సీఎం చంద్రబాబు షాకింగ్ కామెంట్స్(వీడియో)

Chandra Babu shocking comments on currency bann

12:34 PM ON 21st November, 2016 By Mirchi Vilas

Chandra Babu shocking comments on currency bann

రూ. 500, రూ. 1000 నోట్లు రద్దు గురించి తానే లేఖ రాసానని మొదట్లో చెప్పిన ఏపీ సీఎం చంద్రబాబుకి ఇప్పుడు ప్రజల కష్టాలు ఆందోళన కల్గిస్తున్నాయి. అందుకే, పెద్దనోట్ల రద్దు నిర్ణయంతో పాతనోట్ల మార్పిడి, డిపాజిట్ల కోసం రోజుల తరబడి ప్రజలు పడుతున్న ఇబ్బందులపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు స్పందించారు. 12 రోజులైనా పెద్దనోట్ల సమస్య పరిష్కారం కాకపోవడం బాధాకరమన్నారు. ఒక సమస్య ఇన్నాళ్లు అపరిష్కృతంగా ఉండటం తన రాజకీయ జీవితంలో ఇదే తొలిసారని వ్యాఖ్యానించారు.

పెద్దనోట్ల రద్దుతో నిరుపేదల నుంచి ధనికుల వరకు అన్ని వర్గాలు ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. నోట్ల మార్పిడిలో ప్రజల ఇబ్బందులపై ముఖ్యమంత్రి చంద్రబాబు ఆయా జిల్లాల కలెక్టర్లు, ఆర్బీఐ, ఎస్ఎల్బీసీ, ఆర్థిక శాఖ అధికారులతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ..

1/3 Pages

ప్రజలు పడుతున్న ఇబ్బందులకు బ్యాంకర్లు, అధికారులు తక్షణమే ఉపశమనం కల్పించాలని ఆదేశించారు. సంక్షోభ సమయంలో పరస్పర సహకారం, సమర్థ కార్యాచరణ ప్రధానమన్నారు. అన్ని బ్యాంకుల్లోనూ ప్రత్యేక కాల్ సెంటర్లు ఏర్పాట్లు చేయాలని సూచించారు. ఆర్బీఐ నుంచి రాష్ట్రానికి వచ్చిన రూ.2వేల కోట్లలో వంద నోట్లు రూ.400కోట్లు ఉన్నాయని తెలిపారు జన్ ధన్ ఖాతాలు, రూపేకార్డులను వెంటనే క్రియాశీలకం చేయాలని, ప్రభుత్వ లావాదేవీలన్నీ నగదు రహితంగా జరపాలని ఆదేశించారు. అన్ని బ్యాంకులు సమన్వయంతో పనిచేయాలని.. ప్రభుత్వ ఆదేశాలు పాటించని బ్యాంకర్లకు నోటీసులు జారీచేస్తామని హెచ్చరించారు. శాంతిభద్రతలకు భంగం వాటిల్లకుండా చేసే బాధ్యత పోలీసు శాఖదేనని సీఎం స్పష్టం చేశారు.

English summary

Chandra Babu shocking comments on currency bann