క్రికెట్‌కు విండీస్ క్రికెటర్ చంద్రపాల్ గుడ్‌బై

Chandra Paul Retires From Cricket

03:53 PM ON 23rd January, 2016 By Mirchi Vilas

Chandra Paul Retires From Cricket

వెస్టిండీస్ సీనియర్ క్రికెటర్ శివనారాయణ్ చంద్రపాల్ అంతర్జాతీయ క్రికెట్ కు గుడ్ బై చెప్పాడు. అన్ని ఫార్మాట్ల నుంచి రిటైర్మెంట్ తీసుకున్నాడు. 22 ఏళ్ల సుదీర్ఘ కెరీర్‌లో చంద్రపాల్ 164 టెస్టులు ఆడాడు. టెస్టు క్రికెట్‌లో అత్యధిక పరుగులు తీసిన రెండవ విండీస్ ప్లేయర్‌గా చంద్రపాల్ రికార్డుకెక్కాడు. బ్రియాన్ లారా టెస్టుల్లో 11,953 రన్స్ చేయగా, చంద్రపాల్ 11,867 రన్స్ చేశారు. ఇటీవల ఇంగ్లండ్‌తో జరిగిన మూడు టెస్టుల సిరీస్‌లో చంద్రపాల్ పేలవ ప్రదర్శన కనబరిచాడు. దాంతో సెలక్టర్లు అతన్ని జట్టు నుంచి తొలిగించారు. 268 వన్డేలు ఆడిన చంద్రపాల్ తన రిటైర్మెంట్ నిర్ణయాన్ని విండీస్ క్రికెట్ బోర్డుకు ఈ-మెయిల్ ద్వారా తెలిపాడు. టెస్టు జట్టు కోసం జరుగుతున్న సెలక్షన్‌కు దూరంగా ఉంటానని చంద్రపాల్ ఆ లేఖలో పేర్కొన్నాడు.

English summary

West Indies Cricketer Chandra Paul Retires From Cricket . He sends his retirement letter to west indies cricket board by mail. Chandra Paul Played Almost 22 years for west indies, he is the second highest runs scorer in tests