చంద్రబాబుకి కోపం వచ్చింది ....

Chandrababu Dissatisfaction On Budget Allocations To Andhra Pradesh

10:30 AM ON 1st March, 2016 By Mirchi Vilas

Chandrababu Dissatisfaction On Budget Allocations To Andhra Pradesh

కేంద్ర బడ్జెట్లో ఎపికి కేటాయింపులు చూసి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు బరస్ట్ అయ్యారు. విజయవాడలో జరిగిన పార్టీ పొలిట్‌బ్యూరో సమావేశంలో కేంద్ర బడ్జెట్‌లో రాష్ట్ర ప్రాజెక్టులకు చేసిన కేటాయింపులపై చర్చ జరిగింది. ఈ సందర్భంగా ఆయన కొంచెం ఘాటుగానే స్పందించినట్లు తెలుస్తోంది.

చంద్రబాబుకు ఎందుకు కోపం వచ్చిందో ఇప్పుడు చూద్దాం ...

1/4 Pages

పోలవరానికి ఇంతేనా ......

‘ఇప్పటికి మూడు బడ్జెట్లు ప్రవేశపెట్టారు. మొదట.. వారికి కూడా కొంత ఇబ్బంది ఉండవచ్చని అనుకున్నాం. కానీ పతిసారీ ఇదే పరిస్ధితి పునరావృతమవుతోంది. ఈ బడ్జెట్‌లో కూడా పోలవరానికి  నామమాత్రంగా రూ.వంద కోట్లు కేటాయించారు. ఈ లెక్కన ఈ ప్రాజెక్టు ఎప్పటికీ పూర్తవుతుంది’ అని బాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘దానిని జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించారు. కేంద్రమే నిధులు ఇస్తుందన్నారు. ఇప్పుడు రుణం ఇస్తామని అంటున్నారు. ఆ ప్రాజెక్టుకు ఇప్పటివరకు మనం పెట్టిన ఖర్చును ఎంత తిరిగి ఇచ్చేదీ బడ్జెట్లో ఎక్కడా చెప్పలేదు. మూడేళ్లలో ఈ ప్రాజెక్టును పూర్తి చేస్తామని రెండు పార్టీలు కలిసి ఉమ్మడిగా హామీ ఇచ్చాం. ఇలాగైతే ప్రజలకు ఏం సమాధానం చెప్పాలి’ అని చంద్రబాబు  ప్రశ్నించారు.

English summary

Yesterday Central Government Has Announced the Budget by central finance minister arun jaitley.Andhra Pradesh Chief Minister Dissatisfaction On Budget Allocations To Andhra Pradesh which was announced by Indian Finance Minister Arun Jaitley.