ఫారిన్ ట్రిప్ తో డ్యామేజ్ అవుతారా?

Chandrababu Foreign Tour With Family

03:52 PM ON 10th May, 2016 By Mirchi Vilas

Chandrababu Foreign Tour With Family

ఏపీకి ప్రత్యేక హోదా విషయంలో ఏపీ ముఖ్యమంత్రి తన వైఖరిని సూటిగా చెప్పకుండా ఫ్యామిలీతో కలిసి ఆరురోజుల విదేశీ పర్యటన కారణంగా చంద్రబాబు ఇమేజ్ డ్యామేజ్ అవుతుందా అని విశ్లేషకుల అంచనా. ఏపీకి ప్రత్యేక హోదా అవసరం లేదని కేంద్రమంత్రులు ఒకరికి ఇద్దరు స్పష్టంగా తేల్చేయటం..దీని పై ఏపీ అధికార..విపక్షాలుతీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసిన నేపథ్యంలో..కేంద్రమంత్రి అరుణ్ జైట్లీ రియాక్ట్ అయి..కాస్త సర్దుబాటు ధోరణిలో వ్యాఖ్యలు చేశారు. అయితే ఇప్పటికిప్పుడు కేంద్రం నుంచి తప్పుకుంటే, నష్టమే తప్ప లాభం లేదని, అందరూ సంయమనం పాటించాలని అనడం తప్ప, ఏపీ ప్రత్యేక హోదా విషయంలో అసలు ఆయన ఏమి చేస్తారోనన్న విషయాన్ని స్పష్టంగా చెప్పలేదు. ఏపీ భవిష్యత్తును ప్రభావితం చేసే ఈ అంశంపై చంద్రబాబు మరింత స్పష్టత ఇచ్చి ఫారిన్ టూర్ వెళితే బాగుండేదన్న మాట వినిపిస్తోంది. దాదాపు ఆరు రోజులు రాష్ట్రంలో తాను ఉండని నేపథ్యంలో హోదా విషయంలో కేంద్రం దృష్టికి ఏదైనా డిమాండ్ కానీ.. ఏపీ ప్రజలకు తాను చేయాలనుకుంటున్న కార్యాచరణను మరింత వివరంగా వెల్లడించి ఉంటే బాగుండేదన్న వాదన బలంగానే వినిపిస్తోంది.

ఇవి కూడా చదవండి:గ్యాంగ్‌లీడర్ రీమేక్ కి రెడీయా?

మరోపక్క అనంతపురం జిల్లాలో ప్రత్యేక హోదా మీద కేంద్రం తీరును తప్పు పడతూ.. ఏపీ విపక్షానికి చెందిన వైఎస్సార్ కాంగ్రెస్ నేతలు.. వామపక్షవాదులు నిరసన ప్రదర్శనలు నిర్వహిస్తున్నారు. ఇప్పటికే ఈ అంశంపై అనంతపురంలో రిలే నిరాహార దీక్షలు నిర్వహిస్తున్నారు. తాజాగా. వీరికి సంఘీభావం పలికేందుకు చేపట్టిన నిరసన ర్యాలీని పోలీసులు అడ్డుకోవటంతో అక్కడ హైటెన్షన్ నడుస్తోంది.

ప్రత్యేక హోదా విషయం మీద అఖిలపక్ష సమావేశాన్ని నిర్వహించి. అందరిని కలుపుకోవటం.. కేంద్రానికి ఒక వినతిపత్రం ఇవ్వటం లాంటి కార్యక్రమాలు చేసి.. ఫారిన్ టూర్ కు చంద్రబాబు వెళ్తే బాగుండేదని అంటున్నారు. మరి ఫారిన్ టూర్ ప్రభావం ఎలా వుంటుందో వేచి చూడాలి.

ఇవి కూడా చదవండి:అది తప్పేలా అవుతుంది అంటున్న అనుష్క

ఇవి కూడా చదవండి:బన్నీకి పవర్ స్టార్ ఫ్యాన్స్ వార్నింగ్?

English summary

Andhra Pradesh Chief Minister Nara Chandrababu Naidu went to foreign tour along with his family but many of the leaders and many people were opposing that Chandrababu Naidu have to figh on Special Status to AP on BJP .