కడపలో చంద్రబాబు ....

Chandrababu Kadapa Tour

06:14 PM ON 9th January, 2016 By Mirchi Vilas

Chandrababu Kadapa Tour

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు శనివారం కడప జిల్లా అలంఖాన్‌పల్లెలో నిర్వహించిన జన్మభూమి-మావూరు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. మనకు ఉండే వనరులు, అవకాశాలను సమర్థంగా ఉపయోగించుకోవాలన్నారు. కష్టాలను సంక్షోభాలను అవకాశాలుగా మలచుకోవాలని పిలుపునిచ్చారు. 2050కు ప్రపంచంలోనే అత్యున్నతమైన రాష్ట్రంగా ఏపీ ఉండాలని ఆకాంక్షించారు. అయితే రాష్ట్ర విభజన జరిగిన తీరు ప్రతి ఒక్కరినీ ఆందోళనపరిచింద ని ఆయన పునర్ద్ఘాటిస్తూ, ప్రపంచంలో ఎక్కడా లేనివిధంగా హేతుబద్ధత లేని విభజన చేశారని ఆరోపించారు. అలాగే కడప జిల్లాలోని ఇడుపులపాయ ట్రిపుల్‌ ఐటీ స్నాతకోత్సవంలో సిఎమ్ చంద్రబాబు పాల్గొన్నారు. మంత్రి గంటా శ్రీనివాసరావు , రాజ్యసభ సభ్యులు సిఎమ్ రమేష్ తదితరులు పాల్గొన్నారు.

English summary

Andhrapradesh Cheif Minister Chandra Babu Naidu visits kadapa. He attends to Janmabhoomi program which was conducted in Kadapa