కన్నుల పండువగా కృష్ణమ్మకు హారతి(వీడియో)

Chandrababu Naidu and Family attends for Krishna Harati

01:15 PM ON 12th August, 2016 By Mirchi Vilas

Chandrababu Naidu and Family attends for Krishna Harati

గోదావరి పుష్కరాల సందర్భంగా నిత్య హారతికి శ్రీకారం చుట్టిన ప్రభుత్వం ఇప్పడు కృష్ణా పుష్కరాల నేపథ్యంలో పవిత్ర హారతి పేరిట కార్యక్రమం తలపెట్టింది. గురువారం రాత్రి సరిగ్గా 9.28 నిముషాలు... విజయవాడ సమీపంలోని ఇబ్రహీంపట్నం వద్ద పవిత్ర గోదావరి, కృష్ణా సంగమ ప్రాంతంలో బృహస్పతి కన్యారాశిలో ప్రవేశించిన సమయాన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు-భువనేశ్వరి దంపతులు పవిత్ర జలాలను తీసుకుని తన శిరస్సుపై జల్లుకున్నారు. లక్ష వత్తులతో సిద్ధం చేసిన అఖండ జ్యోతిని వెలిగించారు. ఆ క్షణాన బాణసంచా మెరుపులు మెరిసాయి. సినీ దర్శకుడు బోయపాటి శ్రీను దర్శకత్వంలోనే ఇదంతా రూపుదిద్దుకుంది.

సీఎం చంద్రబాబు ఆయన్ను దగ్గరకు తీసుకుని అభినందించారు. మంత్రులు, సినీ నటుడు బాలకృష్ణ హాజరయ్యారు. దుర్గగుడి స్థానా చార్యుల శ్లోక పఠనం... సినీ వ్యాఖ్యాత సాయికుమార్ వ్యాఖ్యానంతో కృష్ణా నదిలో అద్భుతమైన కళానైపుణ్యంతో విద్యుత్తు కాంతులతో పంటుపై ఏర్పాటు చేసిన వేదిక నుంచి నవ పీఠాలపై నిలుచుని అలంకరించిన దీప ప్రతిమలతో కృష్ణమ్మకు హారతి ప్రారంభించారు. వేలాదిగా చేరిన జనం వీక్షిస్తుంటే, ఓంకార హారతితో కృష్ణా హారతి ప్రారంభమైంది. నాగహారతి, పంచ హారతి, కుంభ హారతి, సింహ హారతి, నంది హారతి, సూర్య హారతి, చంద్రహారతి, నక్షత్ర హారతి ఇవ్వగా,ఆతర్వాత రుత్వికులు పూలు తీసుకుని కృష్ణమ్మలో చల్లారు. ఒకో హారతి గొప్పతనాన్ని, నవదుర్గల ప్రాశస్త్యాన్ని రంగరించి మధుర గాత్రంతో కట్టిపడేసేలా తీర్చిదిద్దిన కృష్ణాహారతి నేత్రపర్వమై నిలిచింది. ఈ కార్యక్రమానికి జనం వేలాదిగా తరలివచ్చారు. విజయవాడ నగరం నుంచే కాదు చుట్టుపక్కల పల్లెల నుంచి సైతం ప్రత్యేక బస్సుల్లో హారతి తిలకించడానికి వచ్చారు.

English summary

Chandrababu Naidu and Family attends for Krishna Harati