బాబు గారు  అయస్కాంతమా  

Chandrababu naidu attracts investiments

12:11 PM ON 13th January, 2016 By Mirchi Vilas

Chandrababu naidu attracts investiments

ఈ మధ్య కేంద్రమంత్రులు రాష్ట్రానికి వస్తే చాలు, ఎపి సిఎమ్ చంద్రబాబు ని పొగడ్తలతో ముంఛెత్తు తున్నారు. మొన్న కేంద్రమంత్రి గడ్గారి వచ్చినపుడు బాబు గారిని ఆకాశానికి ఎత్తేసారు. ఇప్పుడు కేంద్రమంత్రి అనంత కుమార్ వంతు వచ్చింది.  చంద్రబాబు అయస్కాంతం లాంటి వారని అనంతకుమార్‌ అన్నారు.  విశాఖలో నిర్వహిస్తున్న  భాగస్వామ్య సదస్సు మూడోరోజున ఆయన పాల్గొని ప్రసంగించారు. అమరావతి నగరాన్ని నిర్మిస్తున్న ఆయన విశ్వకర్మ లాంటివారని కొనియాడారు. పెట్టుబడులను రాబట్టడంతో చంద్రబాబు అయస్కాంతం లాంటి వారని అనంతకుమార్‌ వ్యాఖ్యానించారు.

ఆంధ్రప్రదేశ్‌ ప్రజల సంక్షేమం కోసమే భాగస్వామ్య సదస్సు నిర్వహిస్తున్నట్లు కేంద్రమంత్రి అనంతకుమార్‌ చెప్పారు.  రాష్ట్రాన్ని ఫార్మా హబ్‌గా తీర్చిదిద్దాలని చంద్రబాబు ఆశిస్తున్నారని తెలిపారు. 

ఆంధ్రప్రదేశ్‌లో హెచ్‌పీసీఎల్‌, గెయిల్‌ సంయుక్తంగా రూ.30వేల కోట్లతో పెట్రో కెమికల్‌ కాంప్లెక్స్‌ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. విశాఖలో రూ.600 కోట్లతో వంద ఎకరాల్లో జాతీయ ఫార్మా శిక్షణ, పరిశోధన సంస్థ ఏర్పాటు చేస్తామన్నారు. విజయవాడలో ప్లాస్టిక్‌ ఇంజినీరింగ్‌ హైలెవెల్‌ ట్రైనింగ్‌ ఇనిస్టిట్యూట్‌ ఏర్పాటు చేసి 5వేల మంది విద్యార్థులకు శిక్షణ ఇస్తామన్నారు. గవర్నర్ నరసింహన్ , పారిశ్రామిక వేత్తలు , రాష్ట్ర మంత్రులు పాల్గొన్నారు.

1/1 Pages

English summary

Chandrababu naidu attracts investiments