ఆ ఇద్దరినీ కలిపేసాడు

Chandrababu Naidu Built Friendship Between Anam and Somireddy

04:58 PM ON 12th March, 2016 By Mirchi Vilas

Chandrababu Naidu Built Friendship Between Anam and Somireddy

రాజకీయాలు అంటేనే ఆసక్తికరం.. ఆ మజా వేరులే ... అందునా అధికారం వుంటే లభించే కిక్కు వేరు ... అందులోనూ పొలిటికల్‌ ఫ్యామిలీల రాజకీయాలు అయితే మరీనూ! ఇప్పుడు శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా విషయానికి వస్తే అక్కడ ఆనం, సోమిరెడ్డి కుటుంబాలే రాజకీయాలను శాసిస్తున్నాయి.. సుదీర్ఘ రాజకీయ ప్రస్థానంలో ఈ రెండు కుటుంబాలు ఒకట్రెండు సందర్భాలు మినహాయిస్తే పూర్తి స్థాయిలో కలిసి పనిచేసిన దాఖలాలు లేనేలేవు. ఒకరు పవర్‌లో వుంటే,మరొకరు ప్రతిపక్షంలో ఉండేవారు. ఒకరు ఎడ్డమంటే మరొకరు తెడ్డమనేవారు.. ఇలా దాదాపు ఏడు దశాబ్దాలు.. ఆ రెండు కుటుంబాల మధ్య వైరం కొనసా గుతూ వచ్చింది. ...

కాంగ్రెస్‌ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఆనం కుటుంబంపై సోమిరెడ్డి విరుచుకు పడుతూ, చిన్నపాటి తప్పు చేసినా ఎత్తి చూపేవారు. చురకలు వేసేవారు. అదే తెలుగుదేశం అధికారంలో ఉన్నప్పుడు... సోమిరెడ్డి మంత్రి పదవిలో కొనసాగుతున్న సమయంలో ఆనం బ్రదర్స్ హడావుడి కూడా అదే రేంజ్‌లో ఉండేది. ఎక్కడ తప్పు దొర్లినా ఒంటి కాలిపై లేచేవారు. నిన్నమొన్నటి వరకు పాము ముంగీసల్లా ఉండే వీరి రాజకీయ వ్యవహారశైలి ఇప్పుడు మారింది. ఇటీవల ఆనం బ్రదర్స్‌ తెలుగుదేశం పార్టీలో చేరడంతో ఈ రెండు కుటుంబాలు కలిసి పనిచేయాల్సిన అవసరం ఏర్పడింది.. అందుకే అన్నీ మర్చిపోయి సరదాగా జోకులేసుకుంటూ కల్సి అడుగులు వేస్తున్నారు.

ఇటీవల జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు నెల్లూరుకి వచ్చారు. పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణ అవసరాలకి, అవసరమైన భారీ యంత్రాలు తరలిస్తున్న వాహనాలకి పచ్చజెండా ఊపారు. ఆ కార్యక్రమంలో ఒకనాటి రాజకీయ శత్రువులు.. ఆనం వివేకా... సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డిలు భుజాలపై చేతులేసుకుని కనిపించారు. అంతే కాదు.. వివేకాను మాట్లాడమంటే.. సోమిరెడ్డి అన్న ముందు మాట్లాడతారన్నారు. 'నీరు తాగడం తప్పా.. సాగుచేయడం చేతకాదు' అని వివేకా అంటే;.'తాగడమంటే మద్యం అనుకునేరు. వివేకాకి మద్యం తాగే అలవాటు లేదు' అంటూ సోమిరెడ్డి ఛలోక్తులు విసిరారు. ఉప్పునిప్పులా ఉండే రాజకీయ శత్రువులు, ఇలా సడన్‌గా మంచి మిత్రులుగా మెలగడం అందర్నీ ఆశ్చర్యంలో ముంచెత్తింది. అయినా రాజకీయాలలో ఇవన్నీ కామనే కదా! రాజకీయాలలో శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులు ఉండరన్న నానుడి తెలిసిందే. మొత్తానికి . ఏడు దశాబ్దాల రాజకీయ వైరానికి ముగింపు పలికారు. ఇది సిఎమ్ చంద్రబాబు ఘనత గా టిడిపి శ్రేణులు అంటున్నాయి.

English summary

Andhra Pradesh Chief Minister Build Friendship between Nellore Political Leaders Anam Vivekananda Reddy and Somireddy.Anam Vivekananda Reddywas also joined in TDP on few months back.Now these two were moving very closely.