మనవడికి తలనీలాలు తీయించిన చంద్రబాబు    

Chandrababu Naidu Celebrates His Grandson Devansh Annaprasana Ceremony

11:41 AM ON 27th November, 2015 By Mirchi Vilas

Chandrababu Naidu Celebrates His Grandson Devansh Annaprasana Ceremony

దాదాపు నలుగు దశాబ్దాల క్రితం వచ్చిన తాతా మనవాడి చిత్రం ఇప్పటికీ ఎవర్ గ్రీనే . అయితే ఇప్పటి నిజ జీవిత తాతామనవాళ్లు పాపులర్. కారణం. సిమె చంద్రబాబు , సినీ హీరో - హిందూపురం ఎం ఎల్ ఎ నందమూరి బాలకృష్ణ ల మనవడు కావడమే. ఇంకా చెప్పాలంటే స్వర్గీయ ఎన్ టి ఆర్ ముని మనుమడు. ఇంతకీ విషయం ఏమంటే , ముద్దుల మనవడు దేవాన్ష్ కి తలనీలాలు తీయించే కార్యక్రమం శుక్రవారం నిర్వహించారు. నిన్న మొన్నటి వరకు వరద ప్రాంతాల్లో బిజీ బిజీ గా గడిపిన సీమ్ చంద్రబాబుకి ఆడవిడుపుగా అందునా ముద్దుల మనవడి తలనీలాల కార్యక్రమంలో ఉల్లాసంగా దాడిపారు.

దీంతో చిత్తూరు జిల్లా నారావారిపల్లెలో కోలాహలం ఏర్పడింది. సిఎమ్ చంద్రబాబు - భువనేశ్వరి దంపతులు , బాలకృష్ణ - వసుంధర దంపతులు ఇక దేవాన్ష్ తల్లి దండ్రులు నారా లోకేష్ , బ్రాహ్మణి దంపతులు , ఇతర కుటుంబ సభ్యులు ప్రముఖులు పాల్గొన్నారు. , నాగాలమ్మ గుడి దగ్గర ప్రత్యేక పూజలు చేసి, దేవాన్ష్ కి తలనీలాలు తీయించారు. ప్రముఖుల రాకతో నారావారిపల్లెలో పండగ వాతావరణం నెలకొంది.

మనవడు దేవాన్ష్ అంటే సిఎమ్ చంద్రబాబుకి అమిత ప్రేమ. అందుకే విజయ దశమి నాడు అమరావతి రాజధాని సంకుష్టాపన సందర్భంగా దేవాన్ష్ ని తీసుకురావడమే కాకుండా ప్రధాని నరేంద్ర మోడీ కి చూపించడం , మోడీ కళ్ళ జోడు ని లాగడంతో దేవాన్ష్ కి కళ్ళజోడు పెట్టి , మోడీ సంబర పడడం , దీంతో సిఎమ్ చంద్రబాబు ఉబ్బితబ్బిబ్బవడం తెల్సిందే. అదండీ తాతమనవాడి అనుబంధం ....

English summary

Andhra Pradesh Honourable Cheif Minister Chandrababu Naidu Celebrates His Grandson Devansh Annaprasana Ceremony in chittoor.