డైరెక్టర్‌ ను అభినందించిన చంద్రబాబు

Chandrababu Naidu congratulates Dictator director

04:17 PM ON 23rd January, 2016 By Mirchi Vilas

Chandrababu Naidu congratulates Dictator director

సాధారణంగా రాజకీయ నాయకులకీ, సినీరంగంలో ఉన్న వారికీ చాలా అవినాభావ సంబంధాలుంటాయి. చాలామంది సినీనటులు రాజకీయ నాయకులుగా మారతారు. ఎపి సీఎం చంద్రబాబు నాయుడు, నందమూరి బాలకృష్ణ కి వియ్యంకులు. అంతేకాకుండా మహానటుడు నందమూరి తారక రామారావు గారి కి అల్లుడు. ఆయన బంధువుల్లో చాలామంది సినీరంగానికి చెందిన వారే, అయినప్పటికీ చంద్రబాబు సినీరంగం పై అంత ఆసక్తి చూపించరు. ఎప్పుడో ఒక్కోసారి బాలకృష్ణ సినిమా విజయోత్సవ వేడుకలకు, ఆడియో ఫంక్షన్లకూ వస్తారు. అంతే తప్ప సినిమా కార్యక్రమాల్లో పెద్దగా పాల్గొనరు.

అయితే చంద్రబాబు నేరుగా ఒక సినిమా డైరెక్టర్‌ తో ఫోన్లో మాట్లాడటం విశేషం. బాలయ్య తాజా సినిమా 'డిక్టేటర్‌' దర్శకుడు శ్రీవాస్‌కి ఫోన్ చేసి అభినందించారట. సంక్రాంతికి మంచి సినిమా అందించావు అని శ్రీవాస్‌ను మెచ్చుకున్నారట. బాలయ్య సినిమా ప్రేక్షకులని అలరించాలనే ఉద్ధేశంతో ఈ సినిమాలో ఎటువంటి కొత్త ప్రయోగాలూ చెయ్యకుండా ఒక ఫార్ములా ప్రకారమే సినిమా తీసాడని శ్రీవాస్‌ చెప్తున్నాడు.

English summary

Chandrababu Naidu congratulates Dictator movie director Srivass for Dictator movie success on phone.