టిడిపి పుట్టిందే హైదరాబాద్ లో .....

Chandrababu Naidu Election Campaign In Hyderabad

06:46 PM ON 29th January, 2016 By Mirchi Vilas

Chandrababu Naidu Election Campaign In Hyderabad

'నా మనసుకు దగ్గరగా ఉన్న నగరం హైదరాబాద్‌.హైదరాబాద్‌కు ఐటీ కంపెనీలు వచ్చాయంటే అది నా చొరవే. హైదరాబాద్‌లో గల్లిగల్లిలో సీసీ రోడ్లు వేయించా. అంతెందుకు తెలుగుదేశం పార్టీ పుట్టింది కూడా హైదరాబాద్‌లోనే' అని ఏపీ ముఖ్యమంత్రి, టిడిపి అధినేత చంద్రబాబునాయుడు స్పష్టం చేసారు. గ్రేటర్‌లోని సనత్‌నగర్ పాటిగడ్డలో ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు మాట్లాడారు. హైదరాబాద్‌లో నాకేం పని అంటూ కొందరంటున్నారని చంద్రబాబు ప్రస్తావిస్తూ, గత 35 సంవత్సరాలుగా హైదరాబాద్‌లోనే ఉంటున్నానని ఆయన చెప్పారు. తెలుగు వారికోసం, వారి ఆత్మగౌరవం కోసం పుట్టిన తెలుగుదేశం పార్టీ, తెలుగు జాతి ఎక్కడుంటే అక్కడ ఉంటుందని చంద్రబాబునాయుడు పేర్కొన్నారు.

English summary

Nara Chandrababu Naidu today participated in Greater Hyderabad Election(GHMC) Campaign and he says that he was living in Hyderabad for 35 years and TDP party was also started in Hyderabad.He says that Telugu People party was TDP