వాడకం ఇలా ఉంటుందా?

Chandrababu Naidu Fires On AP Ministers

01:10 PM ON 24th May, 2016 By Mirchi Vilas

Chandrababu Naidu Fires On AP Ministers

దూకుడు సినిమాలో హీరో మహేష్ బాబు తన పని పూర్తిచేసుకోడానికి కొందరు ఆర్టిస్టులను ఎలా వాడుకున్నాడో చూసాం కదా. వాడకం ఇలా ఉంటుందా అని సదరు నటులు కూడా వాపోవడం తెల్సిందే. ఇప్పుడు పాపం ఎపి సిఎమ్ చంద్రబాబు ఆవేదన కూడా ఇంచు మించు ఇలానే వుంది. ఆయనకు తెలీకుండా ఆయన పేరుని వాడేస్తున్నారట. స్వయంగా ఆయనే ఆవేదనకు గురయ్యారు. వివరాల్లోకి వెళ్తే, సీఎంను ప్రసన్నం చేసుకునేందుకు వివిధ శాఖల అధికారులు సరికొత్త ప్రణాళికలు రచిస్తున్నారు. తమ శాఖల పరిధిలోని పథకాలకు ‘చంద్రన్న’ పేరు తగిలించేస్తున్నారు. తన ఆమోదం తీసుకోకుండా..తనకు తెలియకుండా ఈ పేరు తగిలించడంపై సీఎం చంద్రబాబు అసహనం వ్యక్తంచేసినట్లు కూడా.

ఇవి కూడా చదవండి:చందమామ కావాలా అయితే సిద్ధం ...

సీఎంవో అధికారులతో ఈ విషయమై ఆయన మాట్లాడారు. సీఎం కార్యాలయానికి తెలియకుండా ఎవరికి వారు ప్రభుత్వ పథకాలకు పేర్లు పెట్టడమేమిటని ప్రశ్నించినట్టు చెబుతున్నారు. ఇక పై ఎవరూ సీఎంవో అనుమతి లేకుండా ప్రభుత్వ పథకాలకు పేర్లు పెట్టొద్దని అధికారులకు సీఎం స్పష్టంచేశారు. అంతేగాక ఇప్పటికే పేర్లు పెట్టిన పథకాల విషయంలోనూ సమీక్ష జరపాలని ఆదేశించారు. ఇటీవల కొన్ని పథకాలను ప్రభుత్వం ‘చంద్రన్న’ పేరిట ప్రకటించింది. దీంతో కొందరు మంత్రులు, అధికారులు తమకు తోచిన పథకాలన్నిటికీ ‘చంద్రన్న’ పేరు పెట్టడం ప్రారంభించారు. దీనిపై విమర్శలు వెల్లువెత్తాయి. ఈవిషయం తెలిసిన సీఎం..తన పేరు పెట్టి అనవసరంగా ప్రభుత్వానికి చెడ్డపేరు తెస్తున్నారని సీఎం ఆగ్రహం వ్యక్తంచేశారు.

ఇది అవాంఛనీయమైన ధోరణి అని, తన పేరు పెడితే సానుకూలంగా ఉంటానని అనుకుంటే పొరపాటేనని సీఎం వ్యాఖ్యానించినట్టు తెలిసింది. ప్రభుత్వ లక్ష్యాలకు అనుగుణంగా సమర్ధంగా పని చేయడం ద్వారా మాత్రమే తనను మెప్పించగలరని చంద్రబాబు స్పష్టంచేశారు. ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకునే పథకాలకు ఎన్టీఆర్‌ వంటి నేతల పేర్లు పెట్టుకోవచ్చని, దాన్ని ప్రజలు కూడా హర్షిస్తారని పేర్కొన్నారు. మొత్తానికి అన్ని పధకాలకు బాబు గారి పేరు పెట్టడం పై సిఎమ్ కి కాక తగిలింది.

ఇవి కూడా చదవండి:ఐపీఎల్ గురించి మీకు తెలియని విషయాలు

ఇవి కూడా చదవండి:క్లాస్ రూమ్ లో స్టూడెంట్ తో సెక్స్ చేస్తూ దొరికేసిన టీచర్(వీడియో)

English summary

Andhra Pradesh Chief Minister Nara Chandrababu Naidu Fires on Andhra Pradesh Ministers for putting his name on every government schemes.