తాట తీస్తానని హెచ్చరించిన సిఎమ్ చంద్రబాబు ...

Chandrababu Naidu Fires On Sakshi

11:47 AM ON 4th March, 2016 By Mirchi Vilas

Chandrababu Naidu Fires On Sakshi

నవ్యాంధ్ర రాజధాని అమరావతి బ్రాండ్‌ ఇమేజ్‌ దెబ్బతీసేందుకు కొందరు యత్నిస్తున్నారని ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అమరావతిలో పెట్టుబడుల అంశం పై బ్రిటిష్‌ డిప్యూటీ హైకమిషనర్‌ తనను లండన్‌లో సమావేశాలకు పిలిచారని, దీనికి తాను హాజరవుతున్న సమయంలో ఇష్టప్రకారం రాస్తే విలువ ఎక్కడుంటుందని ఆయన ప్రశ్నించారు. అవినీతి సొమ్ముతో పెట్టిన సాక్షి పత్రిక ఆస్తులను ఈడీ అటాచ్‌ చేసినందున అది ప్రభుత్వ ఆస్తేనని ఆయన పునరుద్ఘాటించారు. సత్యం ఆస్తులు ఈడీ అటాచ్‌ చేసినప్పుడు ప్రభుత్వం స్వాధీనం చేసుకోలేదా అని ప్రశ్నించారు. ప్రభుత్వ ఆస్తి అయి ఉండి ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చేలా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. దీనిపై చర్యలు ఎలా ఉండాలన్నది ఆలోచిస్తున్నామని.. ఎలాంటి చర్యలు ఉంటాయో మీరే చూస్తారని చెప్పారు. 'ఏదేదో రాసి విచారణ చేయమంటే చేయాలా? భూములు కొనుక్కుంటే చర్యలు ఎందుకు తీసుకోవాలి? ఆస్తులు కొనగూడదు, వ్యాపారం చేయరాదంటే ఎలా?' అని ప్రశ్నించారు. తన ప్రభుత్వలో తప్పు చేస్తే తాట తీస్తానని హెచ్చరించారు. ఒకవేళ అవినీతి జరిగి ఉంటే చర్యలు తీసుకుంటామ‌న్నారు.

English summary

Andhra Pradesh Chief Minister Chandrababu Naidu Fires On Sakshi Media.He says that he was invited by British Deputy High Commissioner on Amaravathi Investments and that's the reason behind he was going to Britain. He also fires on Sakshi media for writing as their own on Andhra Pradesh Government.