ర్యాంకులతో ఎం ఎల్ ఎ పని తీరు మెరుగుపడేనా?

Chandrababu naidu gives grades to cabinet minister

01:39 PM ON 14th November, 2015 By Mirchi Vilas

Chandrababu naidu gives grades to cabinet minister

ముఖ్యమంత్రి చంద్రబాబు తనదైన శైలిలో ఎం ఎల్ ఎ ల పనితీరుపై ర్యాంకులు ఇస్తున్నారు. ఈసారి 20 పధకాలపై సర్వే జరిపించి ర్యాంకులను లెక్కతేల్చారు. అయితే చాలామంది సీనియర్ల పేర్లు ఇందులో వెనుకబడే వున్నాయి. శ్రీకాకుళం ఎం ఎల్ ఎ గుండా లక్ష్మీదేవి అగ్రస్థానంలో నిలిస్తే , అదే జిల్లాకు చెందిన ఇచ్చాపురం ఎం ఎల్ ఎ బెందాళం అశోక్ ద్వీతీయ స్థానంలో నిలిచారు. ఇక స్టేట్ లో నాల్గవ స్థానంలో నిలిచిన మంత్రి కె అచ్చెన్నాయుడు మంత్రుల ర్యాంకులో తొలిస్థానంలో నిల్చారు. అంటే శ్రీకాకుళం జిల్లాకు చెందిన ఎం ఎల్ ఏలు ముందువరుసలో వున్నారు. తరచూ వివాదాలతో వార్తలకెక్కే పశ్చిమ గోదావరి జిల్లా చింతలపూడి ఎం ఎల్ ఎ చింతమనేని ప్రభాకర్ 60వ స్థానంలో వున్నారు. జిల్లాల వారీగా కూడా ర్యాంకింగ్ ఇవ్వడంతో ఏలూరు ఎం ఎల్ ఎ బడేటి బుజ్జి పశ్చిమ గోదావరి జిల్లాలో తోలివరుసలో వున్నారు. పలువురు మంత్రులు, ముఖ్యంగా సీనియర్లు కూడా వెనుకబడ్డారు. కొందరు మంత్రులైతే 50వ రాంక్ పైమాటేనంట. అసలు ఈ ర్యాంకులు ఇచ్చేది అవినీతి తదితర అంశాలను కూడా పరిగణనలోకి తీసుకుంటున్నారా అని చాలామంది అనుమానం. పార్టీ ప్రతిష్ట పెంచే విధంగా వ్యవహరించడం మీదే ఎక్కువ ద్రుష్టి పెట్టాలని , ఆ దిశగా పనులు వుండాలని పార్టీ అధినేత సిఎమ్ చంద్రబాబు అంటున్నారు. ర్యాంకులు వస్తున్న వాళ్ళలో జూనియర్లు ఎక్కువ వున్నారు. కావాలనే సీనియర్లను టార్గెట్ చేయడాన్కి ఇదో రకమైన చిట్కా ప్రయోగించారా, నిజంగానే పనితీరు మెరుగుకోసం ఇలా చేస్తున్నారా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. పార్టీకి లాభం చేకూర్చే పనులు ఏమి చేసారో చెప్పాలని చందబాబు ప్రశ్నించడం తో పాటూ చేసిన పని కూడా చెప్పుకోవాలని సూచించారు. మా జిల్లా అంతా బాగానే వుందని ఓ ఎం ఎల్ సి అంటే , అలా అనుకుంటే కుదరదని , వాస్తవ దృక్పధంతో పనిచేయాలని బాబు గారు అన్నారని వార్తలొచ్చాయి. అంటే చాలామంది ఎం ఎల్ ఎ ల పనితీరుపై బాబు గారు గుర్రుగా వున్నారా ? మొత్తానికి ర్యాంకుల వ్యవహారం టిడిపి శ్రేణుల్లో చర్చకు దారితీస్తోంద

English summary

Chandrababu naidu gives grades to cabinet minister to motivate the ministers