పురందేశ్వరిని ఎందుకు కలిశారంటే...

Chandrababu Naidu Got Angry On AP Employees

10:29 AM ON 11th June, 2016 By Mirchi Vilas

Chandrababu Naidu Got Angry On AP Employees

ఎపి సిఎం చంద్రబాబుకి, బిజెపి నేత పురందేశ్వరి కి మధ్య ఉప్పు నిప్పు లా వ్యవహారం నడుస్తూనే వుంది. సరిగ్గా ఈ సమయంలో పురందేశ్వరిని ఏపీ ప్రభుత్వోద్యోగులు కలవడం చంద్రబాబుకి ఆగ్రహాన్ని కల్గించింది. అమరావతికి వెళ్లబోమంటూ పలువురు ఉద్యోగులు పురందేశ్వరిని కలవడంపై ఆయన అసహనం వ్యక్తం చేశారు. అసలెందుకు వారు పురందేశ్వరిని కలిశారని తన వద్దకు వచ్చిన గెజిటెడ్ ఆఫీసర్స్ ఫోరం నాయకులను చంద్రబాబు ప్రశ్నించారు.

విషయంలోకి వెళ్తే, అమరావతికి రావడానికి 6 నెలల గడువు కావాలని హెచ్ వోడీల ఉద్యోగులు సీఎంను కోరిన సంగతి తెలిసిందే. అయితే, అది కుదరదన్న చంద్రబాబు జూన్ 27కి ఉద్యోగులు వచ్చి తీరాలని స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో రెండు రోజుల క్రితం దగ్గుబాటి పురందేశ్వరిని ఏపీ ఉద్యోగులు కలిశారు. తాము ప్రస్తుత పరిస్థితుల్లో ఏపీకి వెళ్లలేమని, ఈ విషయాన్ని చంద్రబాబుకు చెప్పాలని వారు విజ్ఞప్తి చేశారు. ఆమెకు మెమోరాండం ఇచ్చి మొరపెట్టుకున్నారు. మొత్తానికి మరోసారి వాతావరణం హీటేక్కింది.

ఇవి కూడా చదవండి:దూడను రేప్ చేసిన కామాంధుడు

ఇవి కూడా చదవండి:'అంతా పేరెంట్స్ చేసారు' మెగా డాటర్ షాకింగ్ కామెంట్స్

English summary

Andhra Pradesh Chief Minister Nara Chandrababu Naidu was got angry on Andhra Pradesh Employees because they met BJP party leader Purandereswari. Chandra Babu Naidu ordered AP employess to come Andhra Pradesh By 27th Of this month.