బాబుకి తృటిలో తప్పిన పెను ప్రమాదం

Chandrababu Naidu just escaped from the threat

11:43 AM ON 1st October, 2016 By Mirchi Vilas

Chandrababu Naidu just escaped from the threat

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు తృటిలో పెను ప్రమాదం తప్పింది. శుక్రవారం ఢిల్లీలో ఇండోసాన్ ఎగ్జిబిషన్ లో పాల్గొన్న అనంతరం మీడియాతో మాట్లాడుతుండగా సెంట్రలైజ్డ్ ఏసీ సిలిండర్ పెద్ద శబ్ధంతో పేలిపోయింది. దీంతో చంద్రబాబుతో సహా అక్కడున్న వాళ్లంతా పేలుడు శబ్ధానికి కలవరపాటుకు గురయ్యారు. వెంటనే చంద్రబాబును కమాండోలు, అధికారులు బయటికి తీసుకెళ్లారు. సిలిండర్ గ్యాస్ లీకై ఈ ఘటన జరిగినట్లు ప్రాథమికంగా నిర్ధారించారు.

English summary

Chandrababu Naidu just escaped from the threat