సీటుకో టీవీ.. రిమోట్ తో .. అమరావతి బస్సు

Chandrababu Naidu Launches Amaravati Buses In Vijayawada

03:36 PM ON 6th June, 2016 By Mirchi Vilas

Chandrababu Naidu Launches Amaravati Buses In Vijayawada

అధునాతన సౌకర్యంతో సరికొత్త టెక్నాలజీతో ఎపి.ఎస్.ఆర్.టి.సి నూతన బస్సులను రంగంలోకి దించింది. ఎపి రాజధాని అమరావతి కోసం ఈ బస్సులు రూపొందించారు. దీనిని విజయవాడలో ఏపీ సీఎం చంద్రబాబు లాంఛనంగా ప్రారంభించారు. సాధారణంగా దూర ప్రాంతాలకు వెళ్లే బస్సుల్లో ప్రయాణికుల సౌకర్యం కోసం ఓ టీవీ ఏర్పాటు చేసి...దానిలో ఒకటో రెండో సినిమాలు వేస్తుండటం సహజం. ఈ మధ్య కాస్త ముందడుగు వేసిన కొన్ని ట్రావెల్ సంస్థలు బస్సుల్లో వైఫై సౌకర్యాన్ని కల్పిస్తున్నాయి. అయితే ఇప్పుడు ఏకంగా సీటుకో టీవీ...ఇష్టమైన ఛానెల్ చూసేందుకు రిమోట్ సౌకర్యం కల్పిస్తూ, ఏపీఎస్ ఆర్టీసీ ఈ సౌకర్యాన్ని అందుబాటులోకి తెచ్చింది .
ఆర్టీసీలో అత్యాధునిక లగ్జరీ బస్సులైన అమరావతి బస్సుల్లో ఈ సౌకర్యాన్ని అధికారులు ఏర్పాటుచేశారు. ప్రతి సీటు వెనకాల టీవీ ఏర్పాటు చేసి మనకు నచ్చిన ఛానెల్ చూసేందుకు రిమోట్ కూడా ఇస్తున్నారు. ఈ సౌకర్యాన్ని 80 అమరావతి బస్సుల్లో సోమవారం నుంచి అందుబాటులోకి తెచ్చారు. ఇది రవాణా రంగంలో సరికొత్త ప్రయోగంగా ఆర్టీసీ అధికారులు చెబుతున్నారు.

ఇవి కూడా చదవండి:ఆ సీరియల్ చూస్తే సెక్స్ లో పాల్గొనడం ఖాయమట!

ఇవి కూడా చదవండి:ఆవిధంగా ' వైఫై' వాడారంటే చర్యలేనట

English summary

Andhra Pradesh Chief Minister Nara Chandrababu Naidu launches new buses to Amaravathi from Hyderabad. In this bus there was facilities like TV to each seat and the seat member can see what ever channel they want with the help of separate remotes.