చంద్రబాబు సినిమా టికెట్ కొన్నారు..

Chandrababu Naidu Launches Mini Cinema Theater In Vijayawada Bus Stand

11:31 AM ON 7th June, 2016 By Mirchi Vilas

Chandrababu Naidu Launches Mini Cinema Theater In Vijayawada Bus Stand

అవునా ఎపి సిఎమ్ చంద్రబాబు సొంత రాష్ట్రంలో సినిమా టికెట్ కొనడమా, అయిన ఇంత హడావిడిలో టికెట్ కొనుక్కుని సినిమా చేసేంత ఖాళీ ఎక్కడిది అనుకుంటున్నారా? అయితే వివరాల్లోకి వెళ్ళాల్సిందే. ఏపీ రాజధాని బెజవాడ మరో చరిత్ర సృష్టిచింది. దేశంలో మరెక్కడా లేని ఒక ఘనతను సాధించింది. బస్టాండ్ అంటే చాలు వెంటనే గుర్తుకు వచ్చే వాతావరణానికి భిన్నంగా ఉండే విజయవాడ పండిట్ నెహ్రూ బస్ట్ స్టేషన్ కు తగ్గట్లే తాజాగా అద్భుత సౌకర్యాన్ని ప్రయాణికులకు అందుబాటులోకి తీసుకొచ్చారు. బస్టాండ్లలో మల్టీఫ్లెక్స్ లు ఏర్పాటు చేయాలన్న ఆలోచనకు రూపం ఇస్తూ..తొలి మల్టీఫ్లెక్స్ ను ఏర్పాటు చేశారు.

వై స్క్రీన్ సంస్థ వెయ్యి మినీ థియేటర్లను ఏర్పాటు చేయాలన్న లక్ష్యంతో ఉన్న నేపధ్యంలో అందులో భాగంగా తొలి మల్టీఫ్లెక్స్ ను బెజవాడ బస్టాండ్ లో ఏర్పాటు చేశారు. తాజాగా ఈ మల్టీఫ్లెక్స్ ను ముఖ్యమంత్రి చంద్రబాబు ఓపెన్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మల్టీఫ్లెక్స్ ప్రారంభించి తన దారిన తాను వెళ్లిపోలేదు. మల్టీఫ్లెక్స్ లో టికెట్ కొన్నారు. లోపలికి వెళ్లి సినిమాను కాసేపు చూశారు. లగ్జరీ సీట్లలో ఉన్న ఈ మినీ థియేటర్లు బస్సుల కోసం వెయిట్ చేసే ప్రయాణికులకు మరింత వినోదంగా మార్చటంతో పాటు.. బస్టాండ్లను కళకళలాడేలా చేస్తాయన్న వాదన వినిపిస్తోంది. దేశంలోనే తొలి మల్టీఫ్లెక్స్ ఉన్న బస్టాండ్ గా చరిత్రలోకి ఎక్కిన బెజవాడ రానున్న కృష్ణ పుష్కరాలలో మరిన్ని హంగులు సమకూర్చుకోనుంది. మొత్తానికి చంద్రబాబు టికెట్ కొనుక్కొని సినిమా చూడటం అందరి దృష్టిని ఆకర్షించింది.

ఇవి కూడా చూడండి: స్టార్ హీరోలకు ఆ సత్తా లేదా అంటూ క్లాస్ పీకిన దాసరి

ఇవి కూడా చూడండి:అమెరికాలో బాలయ్య రేంజ్ చూస్తే, షాక్ ..

English summary

Andhra Pradesh Chief Minister Nara Chandra Babu Naidu Opens A Mini Movie Theater in Vijayawada Bus Stand and he purchases the first ticket and he saw movie for few time by sitting in theater. Vijayawada Bus Stand stood as the first ever Bus Stand in India to have a mini theater.