అనంతలో రికార్డు స్థాయి వర్షం: సిఎమ్ 

Chandrababu Naidu Meeting In Sachiwalayam

12:49 PM ON 28th November, 2015 By Mirchi Vilas

Chandrababu Naidu Meeting In Sachiwalayam

చాలాకాలం తర్వాత హైదరాబద్ సచివాలయంలో సిఎమ్ చంద్రబాబు ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు. పలువురు మంత్రులు , కార్యదర్శులు హాజరయ్యారు. వివిధ శాఖల కార్యదర్శులు హెచ్ ఓ డి లతో నిర్వహిస్తున్న ఈ సమావేశంలో పలు కీలక అంశాలు చర్చిస్తున్నారు. సుదీర్ఘంగా జరిగే ఈ సమావేశంలో అమరావతికి ప్రభుత్వ కార్యాలయాల తరలింపు గురించి చర్చించనున్నారు. ఇటీవల కురిసిన భారీ వర్షాల గురించి సిఎమ్ ప్రస్తావిస్తూ అనంతపురం లో రికార్డు స్థాయి వర్షపాతం నమోదైందని అన్నారు. గత 20ఏళ్లలో లేని విధంగా వర్షం పడిందని ఆయన చెప్పారు. 3గంటలకు 30సెం. మీటర్ల వర్షం కురిసిందన్నారు. భూగర్భ జలాలు పుష్కలంగా వచ్చాయన్నారు. గతంలో నీళ్ళు లేక, పంటలు పండక రైతులు ఆత్మహత్యలు చేసుకునే దుస్థితి ఉండేదని, కానీ ఇప్పుడు వర్షాలతో ఆ పరిస్థితి లేదని ఆయన పేర్కొన్నారు. డిసెంబర్ నెలాఖరు నాటికి అన్నిప్రాంతాల్లో ఫిజియో మీటర్లు ఏర్పాటుచేస్తామని ఆయన చెప్పారు.

గోదావరి ఎత్తిపోతల మెనహా కృష్ణాకు నీళ్ళు వచ్చే స్థితి లేదని , కృష్ణా తీర ప్రాంతానికి ఎగువ నుంచి రావాల్సిన నీళ్ళు కూడా రావడం లేదని సిఎమ్ చంద్రబాబు అన్నారు. నదుల అనుసంధానం, నీరు - చెట్టు , భూగర్భ జలాల అభివృద్ధి , సూక్ష్మ బిందు సేద్యం సత్ఫలితాలు ఇస్తున్నాయని ఆయన చెప్పారు. ద్వారానే ఈ పరిస్థితి నుంచి అధిగమించాలని సిఎమ్ చంద్రబాబు అభిప్రాయపడ్డారు. దేవాదాయ శాఖ పనితీరుని సిఎమ్ ప్రశంసించారు. 150 ఆలయాలను బాగా నిర్వహిస్తున్నారని ఆయన అన్నారు.

ఇప్పటికే 800కోట్ల రూపాయల టూరిజం ప్రాజెక్టులు అందుబాటులోకి వచ్చాయని , మరో 600కోట్ల రూపాయల ప్రాజెక్టులు రాబోతున్నాయని సిఎమ్ చెప్పారు. ఇప్పటికే లక్షన్నర మంది పర్యాటకులు సందర్సించారని , ఎపికి విదేశీ పర్యాటకులు ఎక్కువగా వస్తున్నారని, విదేశీ పర్యాటకులను ఆకర్షించడంలో విశాఖ ముందంజలో వుందని సిఎమ్ వివరించారు.

English summary

Andhra Pradesh Cheif Minister conducts a meeting with government officials in hyderabad andhra pradesh sachiwalayam after a long time.He says that highest rain fall in ananthapuram recorded 20 years high