వామ్మో, చంద్రబాబు ఆఫర్..

Chandrababu Naidu Offers Extra 5 Marks To Students

11:29 AM ON 30th July, 2016 By Mirchi Vilas

Chandrababu Naidu Offers Extra 5 Marks To Students

అవును వినూత్నంగా ఆలోచిస్తూ, దానికోసం విస్తృత ప్రచారానికి మార్గం ఏర్పరచడంతో పాటు, అమలుకోసం ఆఫర్ లు సైతం ఇవ్వడం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకే చెల్లింది. ఇప్పుడు వనం మనం పేరిట పెద్దఎత్తున మొక్కలు నాటాలని లక్ష్యంగా నిర్ణయించారు. దీన్ని సాధించడం కోసం విద్యార్ధులకు ఓ బంపర్ ఆఫర్ ప్రకటించారు. విద్యార్ధులు ఎవరు ఎక్కువగా మొక్కలు నాటితే వారికి 5 మార్కులు ఎక్కువగా ఇస్తామంటూ ప్రకటించారు.

అయితే... ఒక్క విద్యార్ధులకే కాదు అటు రాజకీయ నాయకులకు, ఇటు ప్రభుత్వ ఉద్యోగులకు కూడా మరో ఆఫర్ ప్రకటించారు. మొక్కలు ఎక్కువగా నాటిన రాజకీయ నాయకులకే వచ్చే ఎన్నికల్లో సీట్లిస్తామంటూ చంద్రబాబు ప్రకటించారు. ఇక ఉద్యోగులకైతే పదోన్నతులు, బదిలీల్లో ప్రాధాన్యత కల్పిస్తామంటూ ప్రకటించడంతో, ఇక ఆయా వర్గాల ప్రజల్లో ఆస్తక్తి నెలకొనడమేగాక ఎక్కడ చూసినా దీనిపైనే చర్చ కొనసాగుతోంది. కొందరు చోటామోటా నాయకులైతే ఏకంగా బాబుగారి దృష్టిలో పడేందుకు నర్సరీల వెంట తిరుగుతూ మొక్కలు తెచ్చి మరీ, నాటేస్తున్నారట. శుక్రవారం కృష్ణా జిల్లా నూజివీడు మండలం సుంకొల్లు గ్రామంలో వనం మనం కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఈ సందర్బంగా ఆయన పర్యావరణ ప్రాధాన్యతను వివరిస్తూ పైన పేర్కొన్న విధంగా ఆఫర్లు ప్రకటించారు. కాగా, ముఖ్యమంత్రి చంద్రబాబు పిలుపుతో ఇప్పటికే ఏపీలోని పలు స్కూళ్ల యాజమాన్యాలు విద్యార్ధులతో పెద్దఎత్తున మొక్కలు నటిస్తున్నాయి. మొత్తానికి మార్కుల కోసం కొందరు , టికెట్స్ కోసం మరికొందరు ఇలా అందరూ మొక్కలు నాటడంలో నిమగ్నమయ్యారు.

ఇవి కూడా చదవండి:టీవీ 'షో' తో దుమ్మురేపనున్న పవన్

ఇవి కూడా చదవండి:గ్యారేజ్ లో చందమామ అందాలు

English summary

Andhra Pradesh Chief Minister Nara Chandra Babu Naidu Offers Extra 5 Masrks To the Students who plants more number of Plants.