ఇద్దరిదీ తప్పేనన్న 'బాబు' 

Chandrababu Naidu On Sand Mafia

01:39 PM ON 21st December, 2015 By Mirchi Vilas

Chandrababu Naidu On Sand Mafia

ఆ మధ్య పశ్చిమ గోదావరి జిల్లాలో జరిగిన తహసిల్దార్ వనజాక్షి , ఎంఎల్ఎ చింతమనేని ప్రభాకర్ వివాదంలో ఇద్దరిదీ తప్పేనని ఎపి సిఎమ్ చంద్రబాబు జడ్జిమెంట్ ఇచ్చారు.కోర్టు తీర్పు కాదండోయ్.... ప్రజాప్రతినిధూ ప్రాతినిద్యం వహించే సభలో ఆయన ఈ విషయం చెప్పారు.

శాసనమండలిలో సోమవారం ఉదయం ఈ ఘటనపై సిఎమ్ స్పందించారు. 'తహసిల్దార్ వనజాక్షి తన పరిధి దాటి , వేరే ప్రాంతంలోకి వెళ్ళారు. డ్వాక్రా సంఘాలకు మద్దత్తుగా ఎం ఎల్ ఎ ప్రభాకర్ వెళ్ళారు.ఈ దాడి లో ఇద్దరిదీ తప్పే 'అని సిఎమ్ చంద్రబాబు అన్నారు.

' సరిహద్దు దాటి వెళ్ళడం తప్పని తహసిల్దార్ వనజాక్షికి చెప్పాం. పద్దతి కాదని ఎంఎల్ ఎని హెచ్చరించాం. ప్రతివొక్కరికీ హక్కులతో పాటూ భాద్యతలూ వుంటాయి. ఎవరూ తమ భాద్యత విస్మరించకూడదు' అని ఆయన స్పష్టం చేసారు. తప్పు ఎవరు చేసినా ఉపేక్షించబోమని ఆయన అన్నారు.

English summary

Andhra Pradesh Cheif Minister Chandrababu naidu says that both MLA Chinthamaneni Prabhakar and MRO Vanajaakshi both were done mistakes in Sand Mafia Case in west godavari. This was said by Chandrababu in Andhra Pradesh Assembly