కేంద్రంతో కయ్యానికి బాబు రెడీ?

Chandrababu Naidu Planning To Fight On Central Govt

01:17 PM ON 3rd May, 2016 By Mirchi Vilas

Chandrababu Naidu Planning To Fight On Central Govt

ఇన్నాళ్ళూ కేంద్రంతో సాగుతున్న అంతర్యుద్దం ఇప్పుడు బహిరంగ యుద్దానికి రంగం సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఆంధ్రప్రదేశ్ రాష్ర్టానికి కేంద్ర ప్రభుత్వం - బీజేపీ ఎన్నో విధాలుగా సహాయం చేస్తోందటూ కమళనాథులు - ఢిల్లీ పెద్దలు సాగిస్తున్న ప్రచారాన్ని తిప్పికొట్టేందుకు ఏపీ సీఎం చంద్రబాబు కౌంటర్ ఎటాక్ సిద్ధం చేస్తున్నట్లు పరిస్థితులు తెలియజేస్తున్నాయి. తాజాగా కేంద్రమంత్రి హరీభాయ్ చౌదరి చేసిన వ్యాఖ్యలు - ప్రతిపక్షాల విమర్శలు తెలుగుదేశం పార్టీని తమదైన శైలిలో రంక్షించు కోడానికి బాబు పధక రచన చేసినల్టు పార్టీ వర్గాల నుంచి వినిపిస్తోంది. ఇన్నాళ్ళూ డిల్లీ వెళ్లి, ఎన్నో రకాలుగా సాయం అర్ధించినా తగిన స్పందన లేదని అందుకే కయ్యానికి కాలు దువ్వాలని బాబు ప్లాన్ అట.

ఇవి కూడా చదవండి:మాట మీద నిలబడే మనిషి పవన్

ఏపీకి ప్రత్యేక హోదా - వెనకబడిన జిల్లాలకు నిధుల కేటాయింపు పోలవరాన్ని జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించి పూర్తి వ్యయాన్ని తామే భరిస్తామని - రెవెన్యూ లోటును కూడా భర్తీ చేసి ఆదుకుంటామని విభజన చట్టంలో ఇచ్చిన హామీల అమలుకు పట్టుబట్టాలని చంద్రబాబుపై ఒత్తిడి పెరుగుతోంది. విభజన చట్టంలో ఇచ్చిన హామీలు - కేంద్రం ఇచ్చిన నిధులపై అంశాలవారీగా ఒక శ్వేతప్రతం విడుదల చేసే పనిలో ముఖ్యమంత్రి చంద్రబాబు కసరత్తు ప్రారంభించారని అంటున్నారు. దీనిపై పార్టీలో సీనియర్లతో చర్చించి త్వరలో ఒక నిర్ణయం తీసుకోవాలనే యోచనలో ఉన్నారట.

ఇవి కూడా చదవండి:రాజ్యసభకు లిక్కర్‌ కింగ్‌ రాజీనామా

కొత్త రాజధాని నిర్మాణానికి రూ.2500 కోట్ల నిధులు ఇచ్చామని పోలవరానికి రూ. 7100 కోట్ల నిధులు సమకూర్చి 2018 నాటికి ఒక దశ పూర్తయ్యేందుకు చర్యలు తీసుకుంటామని పది జాతీయ విద్యా సంస్ధలను ఏర్పాటు చేశామని కేంద్ర మంత్రి హరిభాయ్ చౌదరి రాజ్యసభలో ప్రకటించగా, తమకు ఇంతవరకు రూ. 850 కోట్లు మాత్రమే అందిందని రాష్ట్ర ప్రభుత్వం అంటోంది. పోలవరం ప్రాజెక్టుకు రూ.4000 కోట్లు ఇవ్వాలని రాష్ట్ర ఆర్ధిక శాఖ మంత్రి యనమల రామకృష్ణుడు గత ఫిబ్రవరిలోనే కేంద్రానికి వినతిపత్రం సమర్పించారు. కాని బడ్జెట్ లో రూ.100 కోట్లు కేటాయించారు. దీనిపై రాష్ట్రప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేయగా నాబార్డు నుంచి నిధులు ఇస్తామని కేంద్ర మంత్రి ఉమాభారతి చెప్పినా ఇంతవరకు ఫలితం శూన్యం. ఇటీవల కేంద్రం ఆదేశంపై పోలవరం అథారిటీ అధికారులు ప్రాజెక్టును సందర్శించి నిర్మాణాలను అంచనావేసి నివేదికను కేంద్రానికి అందించారు.రాష్ట్రంలో ఉత్తరాంధ్రలోని 3 రాయలసీమలోని 4 వెనకబడిన జిల్లాలకు ఒకసారి మాత్రమే రూ.50 కోట్ల చొప్పున రూ.350 కోట్ల చొప్పున రెండేళ్లుగా రూ. 700 కోట్లు ఇచ్చామని కేంద్రం చెబుతోంది. విభజన సందర్భంగా రెవెన్యూలోటు రూ. 16000 కోట్లు ఉంది. ఏపికి కేంద్రం రూ.13500 కోట్లను రెవెన్యూ లోటు భర్తీకి చెల్లించాలని కాగ్ సిఫార్సు చేసింది. ఈ నివేదికను కూడా కేంద్రం పట్టించుకోలేదనే విమర్శలు ఉన్నాయి.

ఇవి కూడా చదవండి:మీ కెరీర్‌ని ప్రారంభించాలంటే ఈ సిటీలు బెస్ట్‌

ఇప్పటికే కేంద్రం తీరుపై అసంతృప్తిగా వున్న బాబు అసలు కేంద్రం ఏం చెప్పింది? ఏం చేసింది? అనే అంశంతో పాటు రాష్ట్ర పరిస్థితి కూడా ప్రజలకు తేటతెల్లం చేయడానికి శ్వేతపత్రం దోహదమవుతుందని అంటున్నారు. ముసుగులో గుద్దులాట ఎందుకని ఇక బహిరంగంగా తేల్చుకోడానికి బాబు సిద్ధపడితే, మరి బిజెపి ఎలా స్పందిస్తోందో చూడాలి.

English summary

Andhra Pradesh Chief Minister Nara Chandra Babu Naidu was planning to Control Central BJP government Because recently a central minister said that there is no need of Special Status For Andhra Pradesh.