వామ్మో, బాబు గారి ఆస్తులు 117 కోట్లా?

Chandrababu Naidu properties value is 117 crores

11:57 AM ON 11th August, 2016 By Mirchi Vilas

Chandrababu Naidu properties value is 117 crores

ఈ దేశంలో కోటీశ్వరుల జాబితా బానే కనిపిస్తోంది. అందునా రాజకీయాల్లో వున్న నేతల్లో కూడా ఈ తరహా వారు ఎక్కువగానే వున్నారు. ఇంతకీ ఎపి సీఎం చంద్రబాబు గురించి ప్రస్తావిస్తే, అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫామ్స్, నేషనల్ ఎలక్షన్ వాచ్ సంస్థల ప్రతినిధులు చేసిన అధ్యయనంలో కొత్త విషయం తేలిందని అంటున్నారు. ఎన్నికల వేళ రాజకీయ నాయకులు సమర్పించే నామినేషన్లలో సమర్పించిన ఆస్తుల వివరాలపై సమగ్ర పరిశీలన జరిపిన ఈ సంస్థ తాజాగా వివిధ నేతల ఆస్తుల్ని వెల్లడించింది. తాజాగా వెల్లడించిన ఈ నివేదిక ప్రకారం దేశంలోనే అత్యధిక ఆస్తులున్న ముఖ్యమంత్రిగా చంద్రబాబు పేరును ప్రకటించటం ఇప్పుడు సంచలనంగా మారింది. కాస్త షాకింగ్ గా ఉన్నా ఇది నిజమని చెబుతున్నారు. ఈ సంస్థ విడుదల చేసిన నివేదిక ప్రకారం చంద్రబాబు ఆస్తుల విలువ మొత్తంగా రూ.117 కోట్లుగా తేల్చారు.

వివరంగా చెప్పాలంటే చంద్రబాబు ఆస్తి మొత్తం రూ.134 కోట్ల 80 లక్షల 11 వేల 728 చరాస్థులని.. రూ.42.68 కోట్ల స్థిరాస్తులు ఉన్నాయని.. వీటిల్లో అప్పులు తీసేస్తే నికరంగా రూ.117 కోట్లు ఆస్తులు ఉన్నాయని తేల్చారు. దేశంలోని ముఖ్యమంత్రుల్లో చంద్రబాబు ఆస్తి విలువను లెక్కలోకి తీసుకుంటే మొదటి స్థానంలో నిలిస్తే.. దేశవ్యాప్తంగా ఉన్న మంత్రులందరి ఆస్తులతో పోల్చినప్పుడు ఆయన నాలుగో స్థానంలో నిలిచినట్లుగా చెబుతున్నారు. ఇక.. ఇటీవలే అరుణాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన పెమాఖండుకు రూ.129.57కోట్ల ఆస్తులు ఉన్నాయని సదరు సంస్థ వెల్లడించింది. ఇక.. తమిళనాడు ముఖ్యమంత్రి జయలలితకు రూ.113.73 కోట్లు ఉన్నట్లు వెల్లడించారు. ఇక దేశవ్యాప్తంగా ఉన్న మంత్రుల్లో ఏపీ మంత్రి నారాయణ తొలిస్థానంలో నిలిచారు.

ఇక.. చంద్రబాబు క్యాబినెట్ లో ఉన్న 20 మంది మంత్రుల్లో 18 మంది కోటీశ్వరులుగా వెల్లడించారు. ఇదిలా ఉంటే.. ప్రతి ఏటా సెప్టెంబరులో చంద్రబాబు తన ఆస్తులు.. అప్పుల వివరాల్ని వెల్లడిస్తుంటారు. ఇప్పటివరకూ ఆయన ప్రకటించిన ఆస్తుల ప్రకారం.. ఆయన ఆస్తులు ఏనాడు అరకోటి దాటని పరిస్థితి. వాస్తవానికి 2014లో ఆయన ప్రకటించిన ఆస్తులు.. అంతకు ముందు ఏడాదితో పోలిస్తే తగ్గిన పరిస్థితి. ప్రతి ఏటా తన ఆస్తుల వివరాల్ని వెల్లడించే చంద్రబాబు లెక్కకు.. అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫామ్స్.. నేషనల్ ఎలక్షన్ వాచ్ సంస్థల మధ్యన వ్యత్యాసంపై లెక్క ఎలా తేలుతుందో చూడాలి.

English summary

Chandrababu Naidu properties value is 117 crores