కాలువల ఆక్రమణల వల్లే వరదలు

ChandraBabu Naidu reviews flood situation in Nellore

04:42 PM ON 21st November, 2015 By Mirchi Vilas

ChandraBabu Naidu reviews flood situation in Nellore

వరదల వల్ల రాష్ట్రంలో తీవ్ర నష్టం వాటిల్లిందని, ఆర్థికసాయం చేయాలని కేంద్రాన్ని కోరినట్లు ఏపీ సీఎం చంద్రబాబు చెప్పారు. నెల్లూరు కాలవలపై ఆక్రమణ ల కారణంగా వరద ముంచెత్తిందని సిఎమ్ అభిప్రాయ పడ్డారు. 3 నెలల్లో ఆక్రమణలు తొలగిస్తామని చెప్పారు. నెల్లూరు జిల్లాకు 5గురు స్పెషల్ ఆఫీసర్లను నియమించినట్లు ఆయన చెప్పారు. 2,3 ఇక్కడే వుండి బాధితులను ఆదుకుంటామని ఆయన చెప్పారు. వర్షాల కారణంగా వ్యవసాయం , ఆక్వా కల్చర్ కి తీవ్ర నష్టం వాటిల్లిందని ఆయన చెప్పారు.

నెల్లూరులో సీఎం చంద్రబాబు శనివారం పర్యటించారు. మీడియాతో మాట్లాడారు. జాతీయరహదారిపై పడిన గండ్లను పూడ్చి మూడురోజుల్లో పూర్తిస్థాయిలో రాకపోకలను పునరుద్ధరిస్తామని ఆయన పేర్కొన్నారు. సర్వేపల్లి రిజర్వాయరు కింది కాల్వల పనుల్లో అక్రమాలపై విచారణ చేపడతామని చంద్రబాబు చెప్పారు. వర్షం కురుస్తున్నా చంద్రబాబు పర్యటన సాగించారు. సర్వేపల్లి రిజర్వాయర్ ని సిఎమ్ చంద్రబాబు సందర్శించారు. కాగా నెల్లూరు జిల్లాలో మంత్రి పరిటాల సునీత పర్యటించారు.

వరద ప్రభావితప్రాంతాలయిన ఆత్మకూరు, కావలి, నాయుడుపేట ఆర్డీవోలు లో పర్యటించిన మంత్రి తీవ్ర వర్షాలతో నష్టపోయిన రైతుల పంటలను పరిశీలించారు. అనంతరం గూడూరు సబ్ కలక్టర్తో మంత్రి సునీత టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. పంటనష్టపోయిన, ఇళ్లుకోల్పోయిన వరద బాధితుల వివరాలతో నివేదిక ఇవ్వాలంటూ అధికారులను ఆదేశించారు.

వరద బాధితులను ఆదుకుంటామని మంత్రి తెలిపారు. చేనేత కార్మికులు,మత్స్యకారుల కుటుంబాలకు 50 కిలోలు, వరద బాధితులకు 25 కిలోల బియ్యం, సరుకులు ఇవ్వాలని అధికారులను మంత్రి సునిత ఆదేశించారు.

English summary

Chief Minister N. Chandrababu Naidu is conducting an aerial survey in the flood affected areas of Nellore and Chittoor districts. Earlier, he directed the authorities to divert the rescue and relief teams in other teams to Nellore district and instructed the district administration to stay alert in the wake of heavy rains lashing the district and neighbouring areas.