కాల్ మనీ డబ్బు తిరిగి కట్టోద్దన్న సిఎమ్ చంద్రబాబు

ChandraBabu Naidu Says That Not To Pay Intrest

12:56 PM ON 14th December, 2015 By Mirchi Vilas

ChandraBabu Naidu Says That Not To Pay Intrest

ఏపీని, ముఖ్యంగా విజయవాడను వణికించేస్తున్న కాల్ మనీ వ్యవహారంపై ఎపి సిఎమ్ చంద్రబాబు సీరియస్ గా స్పందించారు. అధిక వడ్డీలకు అప్పు తీసుకున్నవాళ్లు తిరిగి డబ్బులు చెల్లించవద్దని సిఎమ్ సూచించారు. ఒకవేళ డబ్బు కట్టమని వేధిస్తే, నిర్భయ కింద కేసులు పెడతామని అన్నారు. విజయవాడలో కలెక్టర్ల సమావేశంలో కాల్ మనీ , కల్తీ మద్యం గురించి సిఎమ్ ప్రస్తావిస్తూ కాల్ మనీ లాంటి ఘటనలు రాజధాని ఇమేజ్ ని దెబ్బతీస్తాయని ఆన్నారు. ఇలాంటి వాటిని ఆదిలోనే తుంచేయాలని ఆయన స్పష్టం చేసారు.

కాల్ మనీ టర్నోవర్ రూ 66 కోట్లా?.....

ఇప్పుడు హాట్ టాపిక్ గా మారిన కాల్ మనీ టర్నోవర్ ఏడాదికి రూ.600 కోట్లట. అన్ని వ్యాపారాల కన్నా లాభ సాటిగా మార్చుకున్న కాల్ మనీ వ్యాపారం దందాలో అక్రమంగా చేతులు మారుతున్న డబ్బు లక్షలు ఎప్పుడో దాటి కోట్లకు చేరుతోంది. అసలు కాల్ మనీ అంటే.. ఓ బ్యాంకు మరో బ్యాంకుకు ఇచ్చే స్వల్ప కాలిక రుణం లాంటిదే. ఇంటర్ బ్యాంక్ లావాదేవీల్లో ఒకటి నుంచి పదిహేను రోజుల్లో (మెచ్యూరిటీ పీరియడ్ ప్రకారం) ఒక వ్యక్తి మరొకరికి,బదలాయించే దన్న మాట.

కాల్ మనీ నిర్వచనం ఏమిటబ్బా ?.....

ఒక రోజులో జరిగే లావాదేవీని కాల్ మనీ గా చెబుతుంటారు. ఒకరోజు దాటితే నోటీస్ మనీ అంటారని చెబుతున్నారు. బ్యాంకులు అనుసరిస్తున్న విధానం ప్రకారం.. నగదు నిల్వల నిష్పత్తి (సీఆర్ఆర్)ని మెయిన్‌టెయిన్ చేసేందుకు వాణిజ్య బ్యాంకులు ఒకదానికొకటి రుణాలిచ్చుకుంటాయి. అంటే ఎప్పుడూ క్యాష్ నిల్వలు తరిగిపోకుండా ఉండేలా, నిల్ బ్యాలన్స్ లేకుండా చూసుకుంటాయి. ఈ కాల్ మనీ మీద చెల్లించే వడ్డీని కాల్ రేట్ అంటారు. ఇది ఒక్కోసారి రోజుకే కాదు..గంటకు కూడా మారిపోతుంటుంది. మార్జిన్ అకౌంట్‌ను బ్రోకర్లు మెయిన్ టెయిన్ చేసేందుకు బ్యాంకింగ్ సంస్థలు స్వల్పకాలిక రుణాలిచ్చే విధానమే ఇది. ఈ లోన్‌ని, వడ్డీని ఎప్పుడైనా వసూలు చేయవచ్చు.

ఇదే కాల్ మనీ వ్యాపారులకు, బ్రోకర్లకు వరంగా మారిందని చెప్పాలి. దీని పేరు చెప్పుకుని వడ్డీని, రుణాన్ని నిర్వాహకులు - వ్యాపారులు తాము అప్పులిచ్చిన వ్యక్తి నుంచి ఎప్పుడైనా కలెక్ట్ చేయవచ్చు. దీనికి నిర్దిష్టంగా నిబంధనలంటూ లేకపోవడంతో వాళ్ళు ఇష్టారాజ్యంగా వడ్డీలు గుంజుతున్నారు. రుణం తీసుకున్న వ్యక్తి అసలు చెల్లించినప్పటికీ వడ్డీ కట్టాలంటూ వందలు, వేలు, వసూలు చేస్తున్నారు. చెల్లించలేనివారి ఆస్తులు తనఖా పెట్టుకోవడమో, వారి ఇంటి కాగితాలు స్వాధీనం చేసుకోవడమో చేస్తున్నారు. ఈ కాల్ మనీగాళ్ళ కిరాతకం ఇక్కడితో ఆగిపోలేదు. బాధితుల ఇళ్ళకు బౌన్సర్లను పంపి వారిని బెదిరించడం, అత్యాచారాలు చేస్తామంటూ హెచ్చరించడం చేస్తున్నారు. ఇది బ్యాంకింగ్ వ్యవస్థను తమకు తాము అక్రమంగా సమాంతరంగా నడపడమే.

దీని మీద ప్రభుత్వానికి గానీ, పోలీసులకు గానీ కంట్రోల్ లేకపోవడంతో ఈ దందాగాళ్ళ పని సులువైపోతోంది. ఈ వ్యవహారంలో రాజకీయ నాయకుల జోక్యం పెరిగిపోతోంది. ఇందులో పెట్టుబడులు పెట్టిన వీరికి ఆయా ముఠాల సభ్యులు ప్రత్యేక ఆఫర్లను ఇస్తారట.. ఇందులో ఒకటి ప్రతి నెలా రూ.10 లక్షలు వడ్డీగా చెల్లించడం. మరొకటి ఒక్కోసారి అమ్మాయిలను ఎరగా వేయడం. పైగా ఇన్వెస్ట్ చేసిన వారికి విదేశాల్లో విలాసాలు కూడా సమకూర్చడం వంటి ఇన్నో అక్రమాలు విజయవాడ కాల్ మనీ దందాలో వెలుగుచూస్తున్నాయి.

80 వేల అప్పు తీసుకున్న వ్యక్తి అదే రోజు రాత్రి లక్ష రూపాయలు చెల్లించాలనే దారుణమైన షరతులుంటాయి. చెల్లించకపోతే వడ్డీ ఇంకా పెరిగిపోతూనే వుంటుంది.

ఆగడాలు అన్నీ ఇన్నీ కాదు ......

అధిక వడ్డీ గుంజే కాల్ మనే నిర్వాహకుల దారణం గురించి ప్రస్తావిస్తే , 'ఓ ప్రభుత్వ ఉద్యోగి ఒక లక్ష రూపాయలు అప్పు చేసాడు. ఫలితంగా అతని నెల జీతం 40 వేల రూపాయలు కాల్ మనీ నిర్వాహకుల ఖాతాలోకి మళ్ళించుకున్నారు. అంతేకాదు అతని భార్యను భయపెట్టి లొంగ దీసుకున్నారు. ఇక ఈ నరకయాతన భరించలేక ఆయన మరో ఊరికి బదిలీపై వెళ్ళిపోయాడట. ఇలాంటి ఘటనలు ఒకటా రెండా ఎన్నో వెలుగు చూస్తున్నాయి.

రాజకీయ పార్టీల అండ దండలు చూసుకుని ఈ అక్రమార్కులు పేట్రేగిపోతున్నారు. పోలీసులమీద వత్తిడి పెరిగిపోవడంతో వాళ్ళు కూడా చేతులెత్తేస్తూవచ్చారు. ఇక ఇప్పుడు కాల్ మనీ వ్యవహారం గుట్టు రట్టు అవడంతో చర్యలు ఉంటాయో... లేదో ....

English summary

Andhrapradesh cheif minister responds to call money incident that happened in vijayawada. ChandraBabu Naidu Says that don't pay interest money to them