'బావలు సయ్యా' సాంగ్ పై చంద్రబాబు సీరియస్

ChandraBabu Naidu serious on Silk smitha song

12:27 PM ON 8th July, 2016 By Mirchi Vilas

ChandraBabu Naidu serious on Silk smitha song

అబ్బో సీఎం చంద్రబాబుకు సినిమా పాట మీద కోపం వచ్చింది. అది కూడా సిల్క్ స్మిత పాట గురించి అంట. అదేమిటని అనుకుంటున్నారా? ఇంతకీ సిల్క్ స్మిత పాటకు చంద్రబాబుకు లింకేంటిని ఊహిస్తున్నారా? అయితే వివరాల్లోకి వెళ్లాల్సిందే.. ఏపీలో వెలగపూడి వద్ద ప్రస్తుతం తాత్కాలిక సచివాలయం ప్రారంభమైన సంగతి తెలిసిందే. గురువారం సీఎం చంద్రబాబు గవర్నర్ నరసింహన్ తో కలసి వెలగపూడికి వచ్చిన ఆయన, భవనాల నిర్మాణాలను పరిశీలించిన అనంతరం మీడియాతో మాట్లాడేందుకు సిద్ధమయ్యారు. గవర్నర్ రాకను దృష్టిలో ఉంచుకుని, వేద పండితులను, మేళతాళాలను, మైక్ సెట్ ను అధికారులు ఏర్పాటు చేశారు.

గవర్నర్, చంద్రబాబు అక్కడకు వచ్చేందుకు ముందుగా పలు పాటలు ఈ మైక్ లో ప్లే చేశారు. ఇక చంద్రబాబు, గవర్నర్ అక్కడకు వచ్చి సచివాలయంలో కలియతిరిగాక బాబు మీడియాతో మాట్లాడుతున్నారు. ఓ పక్క బాబు మీడియాతో మాట్లాడుతుంటే మైకుల్లో 'బావ బావమరిది' సినిమాలో సిల్క్ స్మిత డ్యాన్స్ చేసిన 'బావలు సయ్యా' పాట పెద్దగా వినిపిస్తుండటం ఆయనకు అసహనాన్ని కలిగించింది. ఆ మైక్ సెట్ నుంచే ఈ పాట వినిపించినట్టు తెలుస్తోంది. సీఎం ప్రసంగానికి అడ్డుతగులుతున్న పాటలను ఆపాలని అధికారులు పదే పదే కోరాల్సి వచ్చింది. సీఎం ప్రసంగాన్ని లైవ్ చూపిస్తున్న పలు చానళ్లు ఈ పాట వస్తుండటంతో సౌండ్ ను మ్యూట్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది.

అదండీ సంగతి. అయినా ఇలాంటి కార్యక్రమాలకు అలాంటి పాటలేమిటని పలువురు విమర్శలు గుప్పించారు.

English summary

ChandraBabu Naidu serious on Silk smitha song