జేసీతో ఇబ్బందులొస్తున్నాయన్న బాబు

Chandrababu Naidu Settire On Jc Diwakar Reddy

11:53 AM ON 3rd January, 2017 By Mirchi Vilas

Chandrababu Naidu Settire On Jc Diwakar Reddy

రాజకీయాల్లో ఉన్నది ఉన్నట్టు మాట్లాడితే ఎవరికైనా ఇబ్బందే మరి. అందునా తిడుతున్నాడా.. పొగడుతున్నాడా.. అని తెలీకుండా కుండబద్దలు కొట్టినట్లు మాట్లాడే అనంత ఎంపీ జేసీ దివాక రెడ్డి ఏదైనా మాట్లాడితే ఇక చెప్పక్కర్లేదు. నిన్న గాక మొన్న చంద్రబాబు వల్లే టిడిపి గెలవలేదని, బాబుగారు మహాత్మాగాంధీ కాదని అనేసి సంచలనం సృష్టించిన జేసీ ఇప్పుడు బాబుగారి సమక్షంలో జగన్ పై కీలక వ్యాఖ్యలు చేసి, మళ్ళీ వార్తల్లోకెక్కారు. రెడ్డి కులస్తులందరూ జగన్ పార్టీ వైపు పరుగెత్తిపోతున్నారని, అక్కడేముందో తనకూ అర్థం కావడం లేదని జేసీ చేసిన ఈ వ్యాఖ్య తాజా గా కలకలం రేపుతోంది. కులం కూడు పెట్టదన్న వాస్తవం తెలిసినవాడ్ని కనుక తాను తెలుగుదేశంలో చేరానన్న జేసీ, ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్లిపోయారు.

ఇదంతా కర్నూలు జిల్లా ముచ్చుమర్రిలో జరిగిన బహిరంగ సభలో జరిగింది. స్వయంగా చంద్రబాబున్న వేదిక మీదే జేసీ ఇలా 'ఓపెనప్' అయ్యారు.చిన్న వయసు నుంచి జగన్ ని చూస్తూ వస్తున్నానని జేసీ చెబుతూ కొన్ని అభ్యంతరకరమైన వ్యాఖ్యలు కూడా చేశారు. అయితే వెంటనే ముఖ్యమంత్రి చంద్రబాబు మైక్ అందుకుని, దివాకర్ రెడ్డి గురించి తనకు తెలుసునని, ఉన్నదున్నట్లు మనసులో దాచుకోకుండా మాట్లాడ్డం ఆయనకు అలవాటేనని చెప్పుకొచ్చారు. ఒక్కోసారి తనక్కూడా జేసీ మాటలు ఇబ్బందులు కలిగిస్తాయని బాబు గారన్నారు.

ఇవి కూడా చదవండి: దారుణం: న్యూ ఇయర్ వేడుకల్లో నరమేధం

ఇవి కూడా చదవండి: తండ్రీ కొడుకుల మధ్య చిచ్చు - యుపిలో రసవత్తర రాజకీయం

English summary

Ananthapuram MP JC Diwakar Reddy was known for controversy and he was the fire brand in TDP. Recently JC made some sensational comments on AP CM Chandrababu Naidu and now he made some comments on YS Jagan.