సీఎం పుష్కర స్నానంపై అధికారుల్లోనూ టెన్షన్

Chandrababu Naidu Shocked in Krishna Pushkaralu Meeting

03:08 PM ON 6th August, 2016 By Mirchi Vilas

Chandrababu Naidu Shocked in Krishna Pushkaralu Meeting

అవును ఇది సహజమే కదా. గడిచిన గోదావరి పుష్కరాల్లో తొలిరోజు సీఎం పుష్కర స్నానం సందర్బంగా, చోటుచేసుకున్న దురదృష్ట ఘటనను గుర్తుచేసుకుంటే, అధికారులకు చెమటలు పట్టడం ఖాయం. అందుకే కృష్ణా పుష్కరాల ఏర్పాట్లపై సమావేశం నిర్వహించిన ఏపీ సీఎం చంద్రబాబుకు అక్కడ అనుకోని షాక్ ఎదురైంది. అందరూ చంద్రబాబు చెప్పిందానికి తలూపుతూ సార్.. సార్.. అంటున్నా కూడా ఓ అధికారి మాత్రం తన మనసులోని మాటను బయటపెట్టేశారు. గోదావరి పుష్కరాల సమయంలో చంద్రబాబు పుష్కర స్నానం సమయంలోనే తొక్కిసలాట జరిగి 29 మంది చనిపోయిన నేపథ్యంలో ఈసారి అలాంటి ప్రమాదం జరగకుండా చూడాలని.. సీఎం ఎప్పుడు స్నానానికి వస్తారో చెబితే తామంతా ఆ సమయంలో అక్కడ నుంచి వెళ్లిపోతామని.. భక్తులు కూడా తమ జాగ్రత్తలో తాముంటారని అన్నారు. దీంతో చంద్రబాబు ముఖం మారిపోయిందట.

పుష్కర ఏర్పాట్ల సమావేశంలో గుడివాడ హోమియో మెడికల్ కాలేజ్ కు చెందిన ఒక అధికారి మాట్లాడుతూ..సార్..నేను గోదావరి పుష్కరాల్లోనూ పనిచేశా. సీఎం వస్తారని చెప్పి భక్తులను నిలిపివేశారు. మీరు వెళ్లిన తర్వాత ఒక్కసారిగా భక్తులను వదిలేసరికి తొక్కిసలాట జరిగిందని నాతో చాలా మంది చెప్పారు. కాబట్టి ఇప్పుడు కృష్ణ పుష్కరాల్లో మీరు స్నానానికి ఎప్పుడు వస్తారో ముందే చెబితే బాగుంటుంది. మేము భక్తులు అప్రమత్తంగా ఉంటాం అని అనేశారు. దీంతో సమావేశంలో కొద్ది నిమిషాల పాటు మౌనం రాజ్యమేలిందట. గోదావరి పుష్కర తొక్కిసలాటకు మీరే కారణం అన్నట్టుగా సీఎంతోనే నేరుగా అనేశారా అధికారి, అంతేకాదు. ఈసారి కూడా మీరు చెప్పాపెట్టకుండా వస్తే మరోసారి ఇబ్బందులు వచ్చేఅవకాశం ఉందన్నట్టుగా అధికారి మాట్లాడడం అందరినీ ఆశ్చర్యపరిచింది.

దీంతో సమావేశం ఒక్కసారిగా కామ్ గా మారిపోయింది. అయితే.. డీజీపీ వెంటనే తేరుకుని ఈసారి అలాంటి పొరపాట్లు జరక్కుండా జాగ్రత్తలు తీసుకుంటాం అని సర్ది చెప్పారు. సీఎం కూడా స్పందించి గోదావరి పుష్కరాల్లో తొక్కిసలాటకు తనకు ఏమీ సంబంధం లేదని వివరణ ఇచ్చుకునే ప్రయత్నం చేశారు. తాను స్నానం చేస్తున్న సమయంలో ఒక మహిళ వచ్చి కరెంట్ షాక్ కొట్టి భక్తులు చనిపోయారని చెప్పిందని.. తాను స్వయంగా కంట్రోల్ రూమ్ కి వెళ్లి పరిస్థితిని సమీక్షించానని చెప్పారు. చంద్రబాబు ఎంతగా కవర్ చేసుకున్నా కూడా అప్పటి చావులకు ఆయనే కారణమని ప్రజలతో పాటు అధికారుల్లోనూ అభిప్రాయమేర్పడిపోయిందని తాజా ఘటన చెప్పకనే చెబుతోంది. మరి కృష్ణా పుష్కర స్నానం లో ఏమౌతుందోనని భయం , టెన్షన్ ఉండడం సహజమే కదా.

ఇవి కూడా చదవండి:మల్టీ స్టారర్ కోసం కుర్ర హీరోలను పోగేస్తున్న పూరి

ఇవి కూడా చదవండి:డబ్బున్న మంత్రుల్లో నెంబర్ వన్ ఈయనే..

English summary

Andhra Pradesh Chief Minister Nara Chandrababu Naidu was shocked by one of the officer on Krishna Pushkaralu meeting. The officer requested Chandrababu Naidu to not to come to any Pushkar ghat in Krishna Pushkaralu.