మునిగిపోతామని చెప్పేసిన చంద్రబాబు

Chandrababu Naidu Shocking comments

12:38 PM ON 6th August, 2016 By Mirchi Vilas

Chandrababu Naidu Shocking comments

అవునా, ఇలా చెప్పేశారా? ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వకపోతే బిజెపి - టిడిపి మునిగిపోక తప్పదని అనేసారా? ఇంతకీ ప్రధాన మంత్రి మోడీని కల్సిన సమయంలో ఎపి సీఎం చంద్రబాబు కొంచెం గట్టిగానే స్వరం వినిపించారని అంటున్నారు. రాజ్యసభలో ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా అంశం రగడ సృష్టిస్తోన్న వేళ ఢిల్లీ వెళ్లిన ముఖ్యమంత్రి చంద్రబాబు, ప్రధాని మోడీతో జరిపిన భేటీలో ఎపి ప్రత్యేక హోదా అంశంపై ఇంకా తాత్సారం చేయడం ఇరుపార్టీలకు మంచిది కాదని తేల్చి చెప్పినట్టు టాక్ వినిపిస్తోంది. అయితే పార్లమెంటు సమావేశాల తర్వాత నిర్ణయం తీసుకుంటామని చంద్రబాబు కి మోడీ హామీ ఇచ్చినట్టు తెలుస్తోంది. ఎపిలో స్పెషల్ స్టేటస్ సెంటిమెంట్ బలంగా ఉందని, దీనిపై త్వరగా నిర్ణయం తీసుకోవాలని కూడా కోరారని అంటున్నారు.

ఇక మరో కోణం లో ఇంకో వాదన వినిపిస్తోంది. ప్రత్యేక హోదాపై పెరుగుతున్న రగడను ప్రధాని దృష్టికి తెచ్చిన చంద్రబాబు అటునుంచి వచ్చిన ప్రతిస్పందన చూసి ఆశ్చర్యపోయినట్టు వినిపిస్తోంది. హోదా గురించి స్పందించని మోడీ.. పక్కన ఉన్న వెంకయ్యనాయుడి వైపుకు తిరిగి ‘మనం ఏపీకి చేస్తున్న సహాయం గురించి మీరు సరిగ్గా ప్రచారం చేయడం లేద’ని అన్నారట.

‘ఏపీకి ఎంత చేశాం. ఆ విషయాలు ప్రజలకు సరిగ్గా చెప్పండి’ అని మోడీ వెంకయ్యకు చెప్పారట. అంటే.. పరోక్షంగా బీజేపీ సాయాన్ని టిడిపి సరిగ్గా ప్రచారం చేయడం లేదని దీని అర్థమా? ఇదే విషయమై టిడిపి ఎంపీలు చెవులు కొరుక్కుంటున్నారట.

ఇది కూడా చూడండి: గ్రాండ్ ఓపెనింగ్.. రియోలో ఒలంపిక్స్

ఇది కూడా చూడండి: డబ్బున్న మంత్రుల్లో నెంబర్ వన్ ఈయనే..

ఇది కూడా చూడండి: అసోం లో విరుచుకుపడిన ఉగ్రవాదులు

English summary

Chandrababu Naidu Shocking comments.