అంతా లోకేష్ ఇష్టం... చంద్రబాబు షాకింగ్ కామెంట్స్

ChandraBabu Naidu shocking comments about Lokesh

12:16 PM ON 5th October, 2016 By Mirchi Vilas

ChandraBabu Naidu shocking comments about Lokesh

నాదేముంది? అంతా లోకేష్ ఇష్టం.. లోకేష్ ఎప్పుడు రమ్మంటే అప్పుడు నేనొచ్చి నిల్చోవడమే నా పని అంటూ ఏపీ సీఎం చంద్రబాబు అంటూ చేసిన వ్యాఖ్యలు సంచలనం రేపాయి. గత కొన్ని నెలలుగా లోకేష్ ని మంత్రివర్గంలోకి తీసుకోవాలని పలువురు కోరడం, నా నియోజకవర్గం నుంచి పోటీ చేయడానికి లోకేష్ కోసం రాజీనామా చేస్తా అంటూ కొందరు ఎంఎల్ఏలు చెప్పడం, ఈ దసరాలోనే మంత్రి వర్గ విస్తరణ ఉంటుందని భావించడం నేపథ్యంలో బాబుగారి వ్యాఖ్యలు సహజంగానే సంచలనమయ్యాయి. అయితే, ఇంతకీ ఈ వ్యాఖ్యలు చేయడానికి గల కారణంలోకి వెళ్తే... జూబ్లిహిల్స్ లోని పాత ఇంటిని కూల్చేసి సీఎం కొత్త భవనం నిర్మిస్తున్న విషయం విధితమే. ఈ కొత్త ఇంటి నిర్మాణం ఇప్పటికే దాదాపు పూర్తయ్యింది కూడా.

అయితే ఈ ఇంట్లోకి చంద్రబాబు రావడమే తరువాయి. అయితే ఇదే విషయాన్ని గృహ ప్రవేశం ఎప్పుడు సార్? అని చంద్రబాబును తెలంగాణా టిడిపి ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి అడిగారు. ఇందుకు స్పందిచిన సీఎం.. నాదేముంది? అంతా లోకేష్ ఇష్టం.. లోకేష్ ఎప్పుడు రమ్మంటే అప్పుడు నేనొచ్చి నిల్చోవడమే నా పని.. అంతకు మించి నేను చేసేదేముంది, చేయాల్సిదేముంది అంటూ చంద్రబాబు నవ్వుతూ బదులిచ్చారట. సీఎం చంద్రబాబు సోమవారం హైదరాబాద్ లో పార్టీ నేతలతో సమావేశం అయిన సందర్భంగా రేవంత్ రెడ్డి గృహప్రవేశం విషయాన్ని ప్రస్తావనకు తెచ్చారని తెలుస్తోంది. అయితే దసరా అనంతరం గృహ ప్రవేశం జరిగే అవకాశం ఉందని పార్టీ శ్రేణులు చెబుతున్నాయి.

ఇదిలా ఉంటే, త్వరలో మున్సిపల్ ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పటికే ఇందుకు కావాల్సిన కసరత్తును లోకేష్ షురూ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఎన్నికల పనిలో లోకేష్ బిజీబిజీగా ఉండటంతో ముగిసిన తరువాతే గృహ ప్రవేశ కార్యక్రమం ఉంటుందని కార్యకర్తలు, నేతలు భావిస్తున్నారు. ఈ కార్యక్రమానికి తెలుగు రాష్ట్రాల నుంచి పలువురు ప్రముఖులకు ఆహ్వానం అందనుంది. ఇదంతా లోకేష్ దగ్గరుండి చూసుకుంటారని పార్టీ శ్రేణులు చెబుతున్నాయి. అదండీ అసలు సంగతి.

English summary

ChandraBabu Naidu shocking comments about Lokesh