పవన్ కి ఎన్టీఆర్ తో చెక్ పెడుతున్న చంద్రబాబు?!

Chandrababu Naidu sketch to Pawan Kalyan by using Ntr

11:33 AM ON 13th August, 2016 By Mirchi Vilas

Chandrababu Naidu sketch to Pawan Kalyan by using Ntr

నందమూరి కుటుంబానికి.. నారా కుటుంబానికి ఉన్న సంబంధం గురించి అందరికీ తెలిసిందే. 2009 ఎన్నికల్లో నాటి ఆంధ్రప్రదేశ్ లో అధికారం సాధించడానికి తెలుగుదేశం అధినేత చంద్రబాబు, చాలా ఆలోచించి యంగ్ టైగర్ ఎన్టీఆర్ ను రంగంలోకి దించారు. ఆ తరువాత అనేక కారణాల వల్ల ఇద్దరి మధ్య సంబంధాలు బెడిసికొట్టాయి. దీంతోపాటు బాబాయి బాలకృష్ణకు, ఎన్టీఆర్ కు కూడా సంబంధాలు దెబ్బతిన్నాయి. అయితే, బాబాయికి, చంద్రబాబుకు దగ్గరవ్వడానికి ఎన్టీఆర్ చాలా ప్రయత్నాలే చేశాడని, కానీ ఫలించలేదని అప్పట్లో టాక్ నడిచింది. అయితే, గత ఎన్నికల్లో టీడీపీ అధికారంలోకి రావడంతో ఈ గ్యాప్ మరింత పెరిగిందని కూడా గుసగుసలు వినిపించాయి.

అందుకే టీడీపీ మహానాడుకు కానీ, అమరావతి శంకుస్థాపనకు కానీ ఎన్టీఆర్ ను పిలవలేదని అంటారు. కానీ, ప్రస్తుతం జరుగుతున్న కృష్ణ పుష్కరాలకు మాత్రం యంగ్ టైగర్ ని చంద్రబాబు ఆహ్వానించడం అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తింది. దీనికి కారణం పవన్ కల్యాణే కారణమని టాలీవుడ్ లో గుసగుసలాడుకుంటున్నారు. గత ఎన్నికల సమయంలో టీడీపీ, బీజేపీ కూటమికి సహకరించిన పవన్ కల్యాణ్ ఆ తరువాత ఆ పార్టీలకు సహకరించడం లేదు. ఇక, 2019 ఎన్నికల్లో జనసేనతో ఒంటరి పోరాటం చేయాలని పవన్ భావించడం కూడా చంద్రబాబుకి ఇబ్బంది కల్గించే అంశమట. అందుకే ముందస్తు ఎత్తుగడ సిద్ధం చేసిన చంద్రబాబు, బాగా ఆలోచించి, పవన్ కు చెక్ పెట్టడానికి ఎన్టీఆరే సరైనవాడని భావించి నట్లు చెప్పుకుంటున్నారు.

అందుకే కృష్ణా పుష్కరాలకు యంగ్ టైగర్ ని ఆహ్వానించినట్లు ఇన్ సైడ్ టాక్. ఏది ఏమైనా కృష్ణపుష్కరాల్లో నందమూరి కుటుంబం ఒక్కటి కాబోతోందంటే నందమూరి అభిమానులకు అంతకన్నా కావాల్సిందేముంది. అందుకే దీనిపై కామెంట్స్ పడిపోతున్నాయి.

English summary

Chandrababu Naidu sketch to Pawan Kalyan by using Ntr