సమస్యల సుడిగుండంలో ఉన్నాం .. అయినా భయపడం

Chandrababu Naidu speech at Nava Nirmanam Deeksha

12:16 PM ON 2nd June, 2016 By Mirchi Vilas

Chandrababu Naidu speech at Nava Nirmanam Deeksha

విజయవాడ బెంజిసర్కిల్ వద్ద ఏర్పాటు చేసిన నవ నిర్మాణ దీక్షలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాల్గొని ప్రజలతో ప్రతిజ్ఞ చేయించారు. శాసనసభ స్పీకర్ కోడెల శివప్రసాదరావు, సీఎస్ టక్కర్, రాష్ట్ర మంత్రులు దేవినేని ఉమా మహేశ్వరరావు, కామినేని శ్రీనివాస్, కొల్లు రవీంద్ర, ఉద్యోగ సంఘాల నేతలు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. "సమైక్యాంధ్ర కోసం ఉద్యోగులు, విద్యార్థులు, రైతులు రోడ్లపైకి వచ్చి ఉద్యమించారు. ఎన్ని ప్రయత్నాలు చేసినా విభజన ఆపలేకపోయాం. మనకు అన్యాయం జరుగుతుందని ఎవరూ వూహించలేదు" అని ఆయన పేర్కొన్నారు. ఇటలీ స్వాతంత్య్ర దినోత్సవం రోజున మనల్ని బజారులోకి నెట్టేశారని ఆవేదన వ్యక్తం చేశారు. విభజన చేయాలంటే ఆంధ్రప్రదేశ్కు న్యాయం చేయాలని కోరా.. రెండు ప్రాంతాలకు న్యాయం చేసి ముందుకెళ్లాలంటే నాటి పాలకులు లెక్కచేయలేదని ఆవేదన చెందారు. "జనాభా ప్రకారం అప్పులు పంచారు, ఆదాయం మాత్రం ఎక్కడిది అక్కడే అన్నారు. విభజన తర్వాత ఆస్తులు రాలేదు .. అప్పులు మాత్రమే మిగిలాయి' అంటూ రాష్ట్ర పరిస్థితిని వివరించారు. నిర్మాణ దీక్షలో పాల్గొన్న ప్రతి ఒక్కరికీ సీఎం కృతజ్ఞతలు తెలిపారు. సమస్యల సుడిగుండంలో ఉన్నా మని, అయినా భయపడేది లేదని స్పష్టం చేశారు.

ఇది కూడా చూడండి:నాగ చైతన్యకు చెంప చెళ్ళు మనిపించిదెవరు?

ఇది కూడా చూడండి:ప్రముఖ హాస్య నటుడు రజాక్ ఇకలేడు

ఇది కూడా చూడండి:పనికి పంపాలనుకున్న నాన్న పై కేసు పెట్టి న చిన్నారులు

English summary

Chandrababu Naidu speech at Nava Nirmanam Deeksha.