డబ్బుల్లేవ్ అంటూనే బాబు గారి ఖర్చు 133కోట్లా?

Chandrababu Naidu Spends 133 Crores For His Foreign Trips

11:37 AM ON 29th March, 2016 By Mirchi Vilas

Chandrababu Naidu Spends 133 Crores For His Foreign Trips

రాష్ట్ర విభజన వలన ఎపి కి లోటు చాలా వుంది. దీన్ని పూడ్చడానికి సాయం అందడం లేదు అని తరచూ చెప్పే . ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు తాను చేసే ఖర్చుల మాటేమిటన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. పీకల్లోతు అప్పుల్లో ఉన్న రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా వ్యవహరిస్తున్న ఆయన.. తాను చేస్తున్న ఖర్చులపై వేలెత్తి చూపించే అవకాశం ఇస్తున్నారన్న మాటా వినిపిస్తోంది. ఒక అనవసర ఖర్చు విషయంపై ప్రజల నుంచి కూడా తీవ్ర వ్యతిరేకత వస్తూనే వుంది. ఏపీ సర్కారు ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఖర్చుల విషయంలో ఆచితూచి అడుగులు వేయాల్సిన అవసరం ఎంతైనా ఉన్నా, అలాంటిదేమీ లేకుండా ఖర్చుల విషయంలో వెనుకా ముందు చూసుకోకుండా ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యవహరిస్తున్నారన్న విమర్శలు బలంగా ఉన్నాయి. ముఖ్యంగా విదేశీ పర్యటనల సందర్భంగా ప్రత్యేక విమానాన్ని ఏర్పాటు చేసుకోవటం లాంటి వాటిపై విమర్శలు ఉన్నాయి.

ఇవి కూడా చూడండి:హీరోయిన్స్ ని ఏడిపిస్తున్నాడని వార్నింగ్ ఇచ్చిన మోహన్ బాబు

ముఖ్యమంత్రి తరచూ చేస్తున్న విదేశీ పర్యటనల కారణంగా జరిగే లాభం కంటే ఖర్చు లెక్కే ఎక్కువగా ఉందన్న సంగతి వెలుగు చూస్తోంది. తాజాగా బయటకు వచ్చిన లెక్క లను పరిశీలిస్తే, బాబు వైఖరి విపక్షాలకు అవకాశం ఇచ్చేలా ఉందనే చెప్పవచ్చు. బాబు దుబారా భారీగా ఉందని.. గడిచిన ఏడాదిలో ముఖ్యమంత్రి విదేశీ.. స్వదేశీ పర్యటనలు.. ప్రచారాల కోసం కేటాయించిన దాని కంటే అదనంగా రూ.133.05కోట్లు ఖర్చు చేశారని లెక్కలు తేల్చారు. ఆర్థికంగా రాష్ట్ర సర్కారు పీకల్లోతు కష్టాల్లో ఉన్నప్పుడు.. ఇలాంటి అదనపు ఖర్చు ప్రభుత్వం మీదా.. ముఖ్యమంత్రి పని తీరు మీదా ప్రభావం చూపిస్తుందన్న వాస్తవాన్ని మరిచేపోతే ఎలాగని పలువురు విమర్శిస్తున్నారు. యదా రాజా తదా ప్రజా అనే సామెతను మరువు కూడదని పలువురు హితవు పలుకుతున్నారు.

ఇవి కూడా చూడండి:

షాకింగ్ న్యూస్: 'జనతా గ్యారేజ్' లో బాలయ్య

ఊపిరికి ఫోర్బ్స్ ప్రశంసలు

నగ్నంగా నటించడానికి నేను రెడీ..

బాహుబలికి అవార్డా? అంటూ వర్మ ట్వీట్

English summary

Andhra Pradesh Chief Minister Nara Chandra Babu Naidu Spends 133 crores of huge amount for his local and foreign trips. Opposition parties have opposing his expanses for trips and tours.