సహనమే ఆయుధంగా మోడీ సర్కారుతో బాబు రిలేషన్

Chandrababu Naidu To Continue Relation With Modi

11:15 AM ON 10th May, 2016 By Mirchi Vilas

Chandrababu Naidu To Continue Relation With Modi

రాజకీయ వ్యూహాలతో ఆరితేరిన ఎపి సిఎమ్ చంద్రబాబు తన రాజకీయ జీవితంలో ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొని, 10ఏళ్ళపాటు పార్టీని కంటికి రెప్పలా కాపాడి , అధికారంలోకి తెచ్చారు. ఎన్నో ఎత్తులు , పై ఎత్తులు వేసి, సాధించుకున్న అధికారాన్ని కాపాడుకోవడంతో పాటు పార్టీకి ఎలాంటి ఇబ్బంది , రాష్ట్ర అభివృద్ధికి ఎటువంటి నష్టం లేకుండా ఉండేందుకు సరికొత్త పంధా అనుసరించబోతున్నారు. సంయమనం, సహనం అవసరమని ఆయన భావిస్తున్నారు. అందుకే ఏపీకి ప్రత్యేకహోదా విషయం ప్రధాని మోడీ అనుసరిస్తున్న తీరు విషయంలో స్పష్టమైన వైఖరిని అనుసరించనున్నట్లు తెలుస్తోంది. ఎందుకంటే తొందరపాటుతో తీసుకునే నిర్ణయాలతో లాభం కంటే నష్టమే ఎక్కువన్న విషయం చంద్రబాబు తెలియంది కాదు. దీంతో ఏపీ ప్రత్యేక హోదా అంశం మిత్రుల మధ్య దూరాన్ని పెంచటమే కాదు.. కొత్త ప్రత్యర్థుల్ని తయారు చేస్తుందన్న వాదనకు ముగింపు పలికినట్లేనని అంటున్నారు. ఏపీకి ప్రత్యేకహోదా అవసరమైన విషయంలో రెండో అభిప్రాయానికి తావు లేకున్నా.. దాన్ని సాధించుకోవటానికి పోరుబాట కంటే స్నేహాన్నే చంద్రబాబు ఎక్కువగా నమ్ముకున్నట్లు కనిపిస్తోంది. తొందరపాటుతో మోడీతో గొడవ పెట్టుకుంటే..కేంద్రం నుంచి సహాయ నిరాకరణ జరిగితే.. దాని వల్ల జరిగే నష్టం భారీగా ఉంటుందన్న విషయాన్ని చంద్రబాబు గ్రహించబట్టే, పార్టీ నేతలకు విషయం వివరించి, ఎలాంటి విమర్శలు చేయవద్దని సూచించినట్లు చెబుతున్నారు.

ఇవి కూడా చదవండి:​ తండ్రి కాబోతున్న రైనా

మోడీతో స్నేహధర్మానికి ఎంతో విలువ ఇవ్వటం, కేంద్రం ఎన్ని పరీక్షలు పెట్టినా రెచ్చిపోకుండా ఓపికతో.. సహనంతో వ్యవహరించారన్న భావన ఏపీ ప్రజల్లో కలగటం ద్వారా.. తమ పై సానుభూతి వెల్లువెత్తే అవకాశం ఉంటుందన్నది బాబు ఆలోచనగా చెబుతున్నారు. మోడీ సర్కారుతో ఇప్పుడున్న ఫ్రెండ్లీ వాతావరణాన్ని మిస్ కాకుండా చూసుకుంటూ.. తమ ఇబ్బందుల్ని తరచూ కేంద్రానికి వినతుల రూపంలో తీసుకెళ్లటం ద్వారా ఏపీ ప్రయోజనాలకు భంగం వాటిల్లకుండా చూడాలన్నదే బాబు ఆలోచనగా చెబుతున్నారు. పైగా ఎన్నికలకు ఇంకా మూడేళ్ల వరకూ సమయం ఉండటం. ఇప్పటి భావోద్వేగాలు ఎన్నికల నాటికి ఉండే అవకాశం లేని నేపథ్యంలో.. ఇప్పటికిప్పుడు మోడీతో పేచీ ఏ మాత్రం ప్రయోజనం లేదని తేల్చారు. అందుకే.. బీజేపీ నేతల మీదా.. మోడీ సర్కారు మీద తీవ్ర విమర్శలు చేయకుండా ఉండాలన్న మాటను పదే పదే చెబుతున్నట్లుగా తెలుస్తోంది.

ఇవి కూడా చదవండి:​ ఊరి దత్తత వెనుక మహేష్ స్వార్ధం దాగుందా!?

బతిమిలాడితే పోయేదేముందన్నట్లుగా ఉన్న బాబు..తన ఆలోచనను తమ్ముళ్లకు వివరిస్తూ.. ఎవరూ నోరు జారొద్దన్నమాటను స్పష్టంగా చెబుతున్నట్లు తెలుస్తోంది. పార్టీ నేతల వైఖరి ఎలా ఉండాలన్న విషయంపై బాబు ఆలోచనల్ని ఒక సీనియర్ తెలుగుదేశం నేత చెబుతూ..‘‘ఫ్రెండ్లీగా ఉండటం. న్యాయంగా ఏపీకి రావాల్సిన వాటాల గురించి ఎప్పటికప్పుడు కేంద్రం ముందుకు తీసుకెళ్లటం. వారి ఏపీకి ఏమీ ఇవ్వకున్నా సహనంగా వ్యవహరించాలి. ఇంకా వివరంగా చెప్పలంటే.. అరే.. మనోడ్ని మోడీ ఎన్ని ఇబ్బందులు పెడుతున్నాడో అన్న భావన ఏపీ ప్రజలకు వచ్చేలా చేయాలన్నదే ఆయన ఆలోచన’’ అని వివరించారు. వ్యూహకర్త చంద్రబాబు తాజా వ్యూహంతో ఇప్పట్లో మోడీ తో రిలేషన్ కు ఎలాంటి ఇబ్బంది లేనట్టేనని విశ్లేషకులు అంటున్నారు.

ఇవి కూడా చదవండి:​ మహేష్ పొలిటికల్ ఎంట్రీ ఖాయమా?

ఇవి కూడా చదవండి:​ రోబో 2.0 లో గ్రాఫిక్స్ కోసం 100 కోట్లు

English summary

Andhra Pradesh Chief Minister Nara Chandrababu Naidu said to all the TDP leaders that not make comments on BJP leaders and Modi. Chandrababu said that it was good to maintain Good Relationship with Narendra Modi.