ఢిల్లీ పర్యటనతో తేలేది ఏమిటో?

Chandrababu Naidu To Go Delhi On 4th

10:56 AM ON 3rd August, 2016 By Mirchi Vilas

Chandrababu Naidu To Go Delhi On 4th

గడిచిన రెండుమూడు రోజులుగా హాట్ టాపిక్ గా మారిన ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా అంశం ఎటు నుంచి ఎటు ముగుస్తుందో అనుకుంటున్న సమయంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఢిల్లీ పర్యటన పెట్టుకున్నారు. హోదాపై సాగుతున్న నిరసనల పరిణామాల్లో మరో కీలక ఘట్టం చోటుచేసుకుంది. పార్లమెంటులో టీడీపీ ఎంపీల వరుస నిరసనలు - రాష్ట్రంలో ఆందోళనల నేపథ్యంలో ఈ నెల 4న చంద్రబాబు ఢిల్లీ వెళ్ళబోతున్నారు. ఒకవైపు కృష్ణా పుష్కరాలకు ఆహ్వానించడానికి అని వార్తలు వినిపిస్తుండగా, మరోవైపు ప్రధానమంత్రి నరేంద్రమోడీతో సమావేశం అయ్యేందుకు సిద్దమవుతున్నారని అంటున్నారు.

ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా విషయంలో కేంద్ర ప్రభుత్వ వైఖరి పట్ల తెలుగుదేశం పార్టీ తీవ్ర నిరసన వ్యక్తం చేసి పార్లమెంటులో సైతం పార్టీ ఎంపీలు ఆందోళన తెలిపిన నేపథ్యంలో చంద్రబాబు ఢిల్లీ పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది. తెలుగుదేశం పార్టీ వర్గాల కధనం ప్రకారం చంద్రబాబు ఢిల్లీ పర్యటనలో రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ - ప్రధాని మోడీని కలిసి వారిని కృష్ణా పుష్కరాలకు ఆహ్వానించనున్నట్లు చెప్పుకొస్తున్నారు. అలాగే ఉపరాష్ట్రపతి హమీద్ అన్సారీ - సుప్రీంకోర్టు సీజే - పలువురు కేంద్రమంత్రులను ఆహ్వానించే అవకాశం ఉందని తెలుస్తోంది. ప్రధానితో జరిగే సమావేశంలో ఏపీ ప్రత్యేక హోదాపై కేంద్రం వెనక్కు తగ్గడం - అనంతరం పరిణామాలు చర్చకు రావచ్చునని భావిస్తున్నారు. మొత్తానికి బాబు ఢిల్లీ పర్యటన ఆసక్తి రేకెత్తిస్తోంది. కేంద్రంతో నిజంగానే కయ్యం పెట్టుకుంటారా? మెత్త బడతారా? డాంబికం నటిస్తూ, మెతక వైఖరి కొనసాగిస్తారా అనేది తేలనుంది.

ఇవి కూడా చదవండి:కైపెక్కిస్తున్న రష్మి హాట్ సాంగ్(వీడియో)

ఇవి కూడా చదవండి:వాటికైనా రెడీ అంటోన్న ఆంటీ..

English summary

Andhra Pradesh Chief Minister Nara Chandra babu Naidu to go Delhi on 4th of this month and this tour was creating discussions for what purpose CM was visiting to Delhi.