ఇక హైదరాబాద్ కి చెల్లు చీటియా

Chandrababu Naidu To Rule From Andhrapradesh

11:14 AM ON 31st March, 2016 By Mirchi Vilas

Chandrababu Naidu To Rule From Andhrapradesh

రాష్ట్ర విభజన జరిగినప్పటికీ హైదరాబాద్ మహానగరి రెండు తెలుగు రాష్ట్రాలకు ఉమ్మడి రాజధానిగా పదేళ్లు ఉంటుందని అన్నప్పటికీ, ఎపి ప్రజల శ్రేయస్సు దృష్ట్యా , వీలైనంత త్వరగా హైదరాబాద్ ను వదిలేయాలన్న ఆలోచనను కాస్త ఆల్యసంగా తీసుకున్నప్పటికీ అమలు చేసే విషయంలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు వేగంగా అడుగులు వేస్తున్నారు. ఓటుకు నోటు కేసా , మరొకటా, ఇలా రకరకాల కారణాలే ఇందుకు తార్కాణమని విమర్శలు వస్తున్నాయి. ఏది ఏమైనా హైదరాబాద్ ను వదిలేయాలన్న చంద్రబాబు నిర్ణయం ఏపీ ప్రజలకు నిజంగానే ఆనందాన్ని కలిగించిందనే వ్యాఖ్యలు వినవస్తున్నాయి.

ఇది కూడా చదవండి :సూపర్ స్టార్ రజనీ పై కేసు

మొత్తానికి చంద్రబాబు హైదరాబాద్ ను వదిలేసి.. ఏపీ మీద ఫోకస్ చేయటంలో భాగంగా తన నివాసాన్ని ఏపీకి ఇప్పటికే మార్చేసారు . ఈ జూన్ పూర్తయ్యే నాటికి హైదరాబాద్లోని సచివాలయ ఉద్యోగుల్ని ఏపీ తాత్కలిక రాజధానికి తరలించాలన్న నిర్ణయం కూడా తీసుకున్నారు. జూన్లో ఏపీ సచివాలయ ఉద్యోగుల్ని తరలిస్తున్న నేపథ్యంలో.. ఏపీ వర్షాకాల సమావేశాలు ఎక్కడ నిర్వహిస్తారన్న ప్రశ్న సహజంగానే వ్యక్తమైంది. అయితే దీనిపై తాజాగా ఆర్థికమంత్రి యనమల రామకృష్ణుడు బుధవారం ద్రవ్య వినిమయ బిల్లు చర్చ సందర్భంగా క్లారిటీ ఇచ్చేశారు. వచ్చే అసెంబ్లీ సమావేశాల్ని ఏపీ రాజధాని అమరావతిలో నిర్వహించనున్నట్లు ప్రకటించారు. వాస్తవానికి పలుమార్లు ఏపీలో అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలన్న నిర్ణయం తీసుకున్నా అమలు కాలేదు. దీనికి కారణం ఏదైనా హైదరాబాద్లో నిర్వహిస్తూ వచ్చారు. ఇక ఇప్పుడు వచ్చే సమావేశాల గురించి అధికార ప్రకటన వెలువడిన నేపథ్యంలో.. ఏపీ వర్షాకాల సమావేశాలు అమరాతిలో నిర్వహించటం ఖాయమని తేలిపోయింది. మొత్తానికి తాజా అసెంబ్లీ సమావేశాలతో ఏపీ సర్కారు హైదరాబాద్ కు చెల్లు చీటీ ఇచ్చేసినట్లేనా ! చూద్దాం ..

ఇవి కూడా చదవండి :

ఎంఎల్ఏ లు జీతాలమీద ఆధారపడే బతుకుతున్నారా?

నన్ను ఏమైనా అనండి ... నా కొడుకుని అన్నారో ...

'జనతా గ్యారేజ్' తో మెకానిక్ షెడ్స్ కి ఎసరు

English summary

Andhra Pradesh Chief Minister Nara Chandra babu Naidu decided to rule from Andhra Pradesh. Chandrababu Naidu Ordered Andhra Pradesh Secretariat Employees to work from Andhra Pradesh.Next Assembly Sessions were also be done in Andhra Pradesh.