కన్నీరు పెట్టుకున్న బాబు.. భాగ్యనగరంలో చివరి సెషన్

ChandraBabu Naidu weeped in assembly

06:55 PM ON 10th September, 2016 By Mirchi Vilas

ChandraBabu Naidu weeped in assembly

దాదాపు నాలుగు దశాబ్ధాలుగా రాజకీయ జీవితంలో వున్న ఏపీ సీఎం చంద్రబాబు హైదరాబాద్ తో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకుని ఉద్వేగానికి లోనయ్యారు. నగరంతో తనకు 38 ఏండ్ల అనుబంధం ఉందన్నారు. ఈ రోజు అసెంబ్లీనంతటిని ఒకసారి చూసుకున్నానని మిత్రులతో ఫోటోలు దిగి పాత రోజులను నెమరువేసుకున్నామని చెప్పారు. 1978లో తొలిసారి ఎంఎల్ఏ అయినపుడు ఆతర్వాత సినిమాటోగ్రఫీ మంత్రిగా పనిచేశానని చెప్పుకొచ్చారు. ఇదే అసెంబ్లీలో ముఖ్యమంత్రిగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి అనేక కార్యక్రమాలకు శ్రీకారం చుట్టానని భావోద్వేగానికి గురయ్యారు.

ప్రతిపక్షనేతగా ఉన్న సమయంలో కూడా అధికార పక్షమైన కాంగ్రెస్ ను ప్రజా సమస్యలపై నిలదీశానని చెప్పారు. హైదరాబాద్ లో ఇవే చివరి అసెంబ్లీ సమావేశాలని చంద్రబాబు చెబుతూ కన్నీరు పెట్టుకోవడం పలువురిని కలచివేసింది.

ఇది కూడా చదవండి: షాక్: విమానంలో ఎవరూ చేయని పని చేసింది(వీడియో)

ఇది కూడా చదవండి: 2.5 కోట్లతో భారీ సెట్.. అదరహో అనిపించిన పెళ్లి(వీడియో)

ఇది కూడా చదవండి: వినియోగదారులను పచ్చిగా మోసం చేసిన జియో.. అంతా మోసమే!

English summary

ChandraBabu Naidu weeped in assembly