కొత్త డ్రెస్ లో తళుక్కుమన్న చంద్రన్న

Chandrababu Naidu Wore Special Dress In Tajikistan Tour

11:09 AM ON 11th July, 2016 By Mirchi Vilas

Chandrababu Naidu Wore Special Dress In Tajikistan Tour

ఇక్కడ మనం చూస్తున్న ఫోటో చూస్తే, ఏపీ సీఎం చంద్రబాబు కొత్త గెటప్ ఏమిటబ్బా అనిపిస్తుంది. ఎందుకంటే, ఏదైనా విషయం ఉంటే మాట్లాడటం.. సీరియస్ గా ఉండటం.. పని చేసుకుపోవడం తప్ప మిగిలిన విషయాల్ని పెద్దగా పట్టించుకోకుండా ఉండటం బాబు గారి నైజం. అయితే ఈ మధ్య కొంచెం చేంజ్ అయ్యారు. వాస్తవానికి చంద్రబాబుది మిగిలిన నేతలతో పోలిస్తే, డిఫరెంట్ స్టైల్. ఇప్పుడంటే కాస్త నవ్వుతున్నారు కానీ, తొమ్మిదిన్నరేళ్ల పాటు ముఖ్యమంత్రిగా వ్యవహరించిన కాలంలో ఆయన ముఖం మీద నవ్వు పెద్దగా కనిపించేది కాదు. పైగా 'నేను నిద్రపోను - మిమ్మల్ని నిద్రపోనివ్వను' అంటూ అధికారులను హడలు గొట్టేసారు కూడా.

ఇంకా చెప్పాలంటే, నిత్యం పని.. పని అనటమే తప్ప మరో మాట ఆయన నోటి వినిపించేది కాదు. ఆయనంటే చాలు ప్రభుత్వ ఉద్యోగులు హడలిపోయేవారు. తెల్లారింది మొదలురాత్రి వరకూ ఆయన ఎప్పుడూ ఎలా రియాక్ట్ అవుతారో తెలీక.. గుండెలు అరచేతిలో పెట్టుకొని పరుగులు తీసేవారు. ఎప్పుడు ఎక్కడ ఆకస్మిక తనఖీలంటూ తాట తీస్తారో అని వణికిపోయేవారు. పదేళ్లు ప్రతిపక్ష నేతగా ఆయనకు ఎదురైన అనుభవాలు ఆయన్ను పూర్తిగా మార్చేసింది.

ఆ అనుభవమే ఆయన మాటను మార్చేయటమే కాదు.. ముఖంలో నవ్వుల్ని పూయిస్తోంది కూడా. ఆత్మీయంగా మాట్లాడటం.. భావోద్వేగంతో ప్రసంగించటం.. ఉద్యోగుల పట్ల సున్నితంగా వ్యవహరించటం (దాన్నే ఉద్యోగులు అలుసుగా తీసుకొని సరిగా పని చేయటం లేదన్న ఆరోపణలు ఉన్నాయి), తప్పు చేసిన వారి పట్ల కఠిన నిర్ణయాలు తీసుకోకుండా ఉండటం లాంటివి బాబులో వచ్చిన మార్పులు గా ఇప్పుడు చెప్పుకొస్తున్నారు. ఇక తాజాగా విదేశీ పర్యటనకు వెళ్లిన చంద్రబాబు, కజకిస్థాన్ పర్యటన సందర్భంగా ఆయన వేసుకున్న డ్రెస్ అదుర్స్ అనే తీరాలి. అక్కడి సంప్రదాయ వస్త్రధారణలో చంద్రబాబు కొత్తగా మెరిసారు. పైగా ముగ్గురు ముద్దుగుమ్మల మధ్య అక్కడి సంప్రదాయ వస్త్రధారణతో చంద్రబాబు తన టీంతో కలిసి దిగిన ఫోటో మీద అందరి దృష్టి పడేలా ఉంది. సంప్రదాయ దుస్తులు ధరించటం మామూలే అయినా.. తన టీంతో.. అక్కడి స్థానిక యువతులతో దిగిన ఫోటో మాత్రం కాస్త భిన్నంగా ఉందని చెప్పాలి. రెగ్యులర్ ఫార్మాట్ కి భిన్నంగా ఉన్న ఈ పిక్.. ను చూస్తే.. ముద్దుగుమ్మల మధ్య బాబు మెరిసి పోతున్నారన్న టాక్ వినిపిస్తోంది. సెల్ఫీల మోజు ఈయనకు తాకిందా అని కూడా అంటున్నారు.

English summary

Andhra Pradesh Chief Minister had his own style and he recently went to Tajikistan Tour with some of the Ministers of Andhra Pradesh. Chandrababu Spotted in a brand new look in Tajikistan Traditional Dress.