విజయవాడ రెంట్ల పై బాబు చురకలు 

Chandrababu On Rents In Vijayawada

06:48 PM ON 26th January, 2016 By Mirchi Vilas

Chandrababu On Rents In Vijayawada

'ఇక్కడి వాళ్లు హైదరాబాద్, ఢిల్లీ, అమెరికా వెళ్లి పెట్టుబడులు పెడుతుంటారు. ప్రపంచమంతా తిరుగుతారు. ఎక్కడికైనా వెళ్లి వ్యాపారాలు చేస్తుంటారు. చాలా తెలివిగా ఉంటారు. కానీ అదే విజయవాడకు వస్తే మాత్రం చాలా లాభంగా వ్యవహరిస్తారు. ఈ ధోరణి మారాలి , స్వార్థం వీడాలి. తాత్కాలిక లాభాల కోసం చూస్తే, శాశ్వతంగా నష్టపోతారు' అంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు మంగళవారం విజయవాడ వాసుల నుద్దేశించి నవ్వుతూనే చురకలంటిచేసారు.

ఇంతకీ విషయమేమంటే, అమరావతి రాజధాని నిర్మాణం నేపధ్యంలో హైదరాబాద్ నుంచి విజయవాడకు ఏపీ ఉద్యోగులను తీసుకు వెళ్లేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. అయితే, తాము వచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని, కానీ విజయవాడలో అద్దెలు హైదరాబాద్‌లో కంటే ఎక్కువగా ఉన్నాయని, తాము తట్టుకోలేమని చంద్రబాబుకు ఉద్యోగులు మొరపెట్టుకున్నారట.ఇక ఏమాత్రం సంకోచించకుండా మంగళవారం నాడు స్పందించారు. గతంలో కూడా విజయవాడలో అద్దెలపై మాట్లాడిన చంద్రబాబు మరోసారి విజయవాడవాసులకు సైలెంట్ రేవు పెట్టేసారు. హైదరాబాద్ కంటే విజయవాడలో కాస్ట్ ఆఫ్ లివింగ్ ఎక్కువగా వుంటే, మాకిచ్చే జీతాలు సరిపోవంటూ ఉద్యోగులు భయపడుతున్నారని చంద్రబాబు పేర్కొన్నారు.

విజయవాడ చిన్న పల్లెటూరు కాదని, అలాగని మహా నగరం కూడా కాదని అలాంటప్పుడు ఇక్కడి వారు చిన్న చిన్న స్వార్థం వదిలి పెట్టాలన్నారు. అప్పుడే అభివృద్ధిలో ముందుకు పోతామన్నారు. హైదరాబాదు కన్నా మనకు బోలెడు అవకాశాలున్నాయని, కాబట్టి ప్రపంచంలోని టాప్ నగరాల్లో మనం దీనిని నిలబెట్టవచ్చున ని చంద్రబాబు హితవు పలుకుతూ, స్వార్ధాన్ని వదిలిపెట్టాలని సూచించారు. మరి ఈ స్టేట్ మెంట్ మార్పు తెస్తుందా ....

English summary

Andhra Pradesh Cheif Minister Nara Chandrababu Naidu says that Vijayawada people to not to increase house rents. He also said that the Andhra Pradesh Employees were aware of the rents in Vijayawada