యాగం రేపటితో పూర్తి - ప్రణబ్ , చంద్రబాబు  హాజరు 

Chandrababu , Pranab Mukherjee To Attend Ayutha Chandi Yagam

02:03 PM ON 26th December, 2015 By Mirchi Vilas

Chandrababu , Pranab Mukherjee To Attend Ayutha Chandi Yagam

తెలంగాణా సిఎమ్ కెసిఆర్ వ్యక్తిగత హోదాలో నిర్వహిస్తున్న అయుత చండీ యాగం రేపటితో ముగియనుంది. ఇప్పటికే పలువురు వి వి ఐ పిలు , ప్రముఖులు యాగం సందర్శించగా , ఆఖరి రోజు ఆదివారం రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ , ఎపి సిఎమ్ చంద్రబాబు హాజరు అవుతారు. శీతాకాల విడిది కోసం హైదరాబాద్ లో ఉంటూ , ఎపి , తెలంగాణాల్లో పలు కార్యక్రమాల్లో పాల్గొన్న రాష్ట్రపతి ప్రణబ్ మెదక్ జిల్లా ఎర్రవల్లి లో నిర్వహిస్తున్న ఆయుత చండీ యాగానికి ఆదివారం వస్తున్నారు. అలాగే ఎపి సిఎమ్ చంద్రబాబు కూడా హాజరవుతారు. ఈ నేపధ్యంలో భారీ ఏర్పాట్లు చేస్తున్నారు.

మరోపక్క అయుత చండీయాగానికి జనం పోటెత్తుతున్నారు. ఓపక్క సామాన్యులు.. మరోపక్క వీవీఐపీలు ప్రవాహంలా వస్తున్న నేపధ్య్హంలో యాగం ముగుస్తున్నా , యాగశాలను మాత్రం భక్తుల సందర్శనార్ధం డిసెంబర్ 30వరకు ఉంచాలని ఇప్పటికే నిర్ణయించారు. దీంతో ఆఖరి రోజు , పూర్ణాహుతి సందర్భంగా భక్తుల రద్దీని నియంత్రించే చర్యలు చేపట్టినట్లయింది.

English summary