ప్రజలను సంతృప్తి పరచాలన్న చంద్రన్న

Chandrababu Review On Government Schemes

03:35 PM ON 8th January, 2016 By Mirchi Vilas

Chandrababu Review On Government Schemes

ఆంధ్రప్రదేశ్ లో 13 జిల్లాల కలెక్టర్లు, ప్రణాళికశాఖ అధికారులతో శుక్రవారం ఉదయం తాడేపల్లిలోని తన నివాసం నుంచి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్‌ నిర్వహించారు. జన్మభూమి- మావూరుతో పాటు వివిధ పథకాల అమలు తీరుపై సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రజల సంతృప్తే అంతిమ లక్ష్యం కావాలని సూచించారు. ప్రభుత్వ కార్యక్రమాలు, అధికారుల పనితీరులో పారదర్శకత ఉండాలన్నారు. అభివృద్ధికి సంబంధించిన 20 సూచికల ఆధారంగా గ్రామాల్లో అభివృద్ధి పనులకు సంబంధించిన సమాచారాన్ని క్రోడీకరించుకోవాలని సూచించారు. ఆమేరకు కార్యక్రమాలు చేపట్టి అమలు చేయాలని సూచించారు.

ప్రతిగ్రామంలో వాటర్‌ మ్యాపింగ్‌ జరగాలని, జలవనరుల సమాచారాన్ని నమోదు చేయాలని ఆదేశించారు. ప్రభుత్వ శాఖలకు చెందిన సమాచారాన్ని ప్రతిరోజూ 27వేల మంది ఉద్యగులు అప్‌లోడ్‌ చేస్తున్నారని. ఒకవేళ వారు సరిపోకపొతే , స్థానికంగా ఉన్న ఇంజినీరింగ్‌ కాలేజిల సాయం కూడా తీసుకోవాలని ఆయన సూచించారు. ప్రణాళిఖ, ఐటీ విభాగాల అవసరం పెరిగిందని, ఆయన పేర్కొంటూ, అందుకనుగుణంగా పనితీరు మెరుగుపర్చుకోవాలన్నారు. అభివృద్ధి పనుల అమలు, పురోగతికి సంబంధించి ప్రతి గ్రామానికి గ్రేడింగ్‌ ఇవ్వాలని సిఎమ్ చంద్రబాబు సూచిస్తూ , అందుకు 20 సూచికల్ని ఆధారంగా చేసుకోవాలన్నారు.

English summary

Andhra Pradesh Cheif Minister Nara Chandrababu naidu conducted a review government schemes. He ordered officials to work hard to go schemes into the people